పెళ్లికాని అమ్మాయిలు శివరాత్రి పర్వదినాన ఉపవాసం చేస్తే..?

| Edited By: Team Veegam

Feb 25, 2020 | 4:30 PM

పరమశివుడికి మరోపేరు భోళా శంకరుడు. ఆయన్నుమనసారా నిష్టతో పూజించి.. ఏ కోరికలు కోరినా ప్రసాదిస్తాడని భక్తుల నమ్మకం. అంతేకాదు.. శివుడు అభిషేక ప్రియుడు. అందుకే నిత్యం ఏ శివాలయాల్లో చూసినా అభిషాకాలకే ప్రాముఖ్యతనిస్తారు. శివుడు నిత్యాభిషేక ప్రియుడు కావడంతో.. అతడికి పూలు,పత్రం, నీరు ఏది సమర్పించినా సంతోషంగా స్వీకరిస్తాడు. అందుకే చాలా మంది భక్తులు ఆ పరమశివుడికి అత్యంత ఇష్టమైన శివరాత్రి రోజు భక్తి శ్రద్ధలతో పూజలు చేసి ఉపవాసాలు,జాగరం చేస్తారు. రోజంతా ఉపవాసం ఉండి శివున్ని […]

పెళ్లికాని అమ్మాయిలు శివరాత్రి పర్వదినాన ఉపవాసం చేస్తే..?
Follow us on

పరమశివుడికి మరోపేరు భోళా శంకరుడు. ఆయన్నుమనసారా నిష్టతో పూజించి.. ఏ కోరికలు కోరినా ప్రసాదిస్తాడని భక్తుల నమ్మకం. అంతేకాదు.. శివుడు అభిషేక ప్రియుడు. అందుకే నిత్యం ఏ శివాలయాల్లో చూసినా అభిషాకాలకే ప్రాముఖ్యతనిస్తారు. శివుడు నిత్యాభిషేక ప్రియుడు కావడంతో.. అతడికి పూలు,పత్రం, నీరు ఏది సమర్పించినా సంతోషంగా స్వీకరిస్తాడు. అందుకే చాలా మంది భక్తులు ఆ పరమశివుడికి అత్యంత ఇష్టమైన శివరాత్రి రోజు భక్తి శ్రద్ధలతో పూజలు చేసి ఉపవాసాలు,జాగరం చేస్తారు. రోజంతా ఉపవాసం ఉండి శివున్ని కొలుస్తారు. ఈ రోజు ఎటువంటి ఆహారం తీసుకోకుండా.. నిష్టతో ఉపవాసం ఉంటారు. అయితే ఈ శివరాత్రికి పెళ్లి కాని యువతులు ఉపవాసం చేస్తే.. పరమేశ్వరుడి లాంటి భర్త లభిస్తాడని భక్తుల విశ్వాసం. అలాగే ముత్తైదువులు శివరాత్రి రోజున ఉపవాసం, జాగరణ చేస్తే.. దీర్ఘసుమంగళీ ప్రాప్తం లభిస్తుందని.. అంతేకాకుండా మంచి మనసుతో భర్త జీవితాంతం తోడుంటాడని పెద్దలు చెబుతుంటారు. ఇది భక్తుల విశ్వాసం.

అందుకే శివరాత్రి రోజున పుణ్యతీర్థాల్లో స్నానమాచరించడంతో పాటు.. శైవక్షేత్రాలను సందర్శించడం శుభఫలితాలనిస్తుందంటారు. ఇక పెళ్లి కాని యువతులు.. లింగాకారములోని పరమేశ్వరునికి.. నీరు, తేనే, పాలు, నెయ్యి, చక్కెరతో అభిషేకం చేస్తే నచ్చిన వ్యక్తే భాగస్వామి అవుతాడని నమ్మకం. ఇక ఉపవాసంతో పాటు జాగరణ చేస్తూ.. ఆలయాల్లో జరిగే అభిషేకాలను చూస్తూ.. “ఓం నమశ్శివాయ:” అనే పంచాక్షరీ మంత్రాన్ని జపిస్తే అనుకున్న కార్యాలు సిద్ధిస్తాయని నమ్మకం. జాగారం చేసే వారు.. రాత్రంతా శివుడిని మంత్రాలతో ప్రార్థించాలి.