తమిళంలో స్టార్ హీరో విజయ్ సేతుపతి, త్రిష జంటగా నటించి, ఘన విజయం సాధించిన చిత్రం ’96’. ఈ సినిమాకు తెలుగు రీమేక్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇందులో శర్వానంద్, సమంత ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా.. మాతృకను డైరెక్ట్ చేసిన ప్రేమ్ కుమార్ ఈ తెలుగు వెర్షన్ కూడా తెరకెక్కిస్తున్నాడు. అయితే తాజాగా ఈ సినిమా ఫస్ట్‌లుక్‌తో పాటు టైటిల్‌ను ప్రకటించింది చిత్రయూనిట్.
కాగా.. పోస్టర్‌లో ఒక నాలుగు ఒంటెలు వరుసగా వెళ్తూ.. హీరో శర్వాకు కనిపిస్తాయి. ‘నా జాను ఎక్కడా అని వాటిని’ శర్వా అడిగి తున్నట్టుగా పోస్టర్‌లో కనిపిస్తూ ఉంది. అలాగే.. సినిమా టైటిల్ ‘జాను’ కూడా టూ కలర్స్ బాక్సుల్లో ఇచ్చారు. మొత్తానికి కొంచెం ఇంట్రెస్టింగానే పోస్టర్ ఉంది. కాగా.. ఈసినిమాకి దిల్ రాజు నిర్మతగా వ్యవహరిస్తున్నారు. 2020 ఉగాదికి ఈ సినిమాని రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తోంది చిత్ర బృందం.
Here’s The First Look Of #Jaanu ♥️@Samanthaprabhu2 @Premkumar1710 @SVC_official pic.twitter.com/ltXAVpS7l6
— Sharwanand (@ActorSharwanand) January 7, 2020