డయాగ్నోస్టిక్ సెంటర్లో యువతికి లైంగిక వేధింపులు

|

Jun 22, 2019 | 4:22 PM

కామంతో కళ్లుమూసుకుపోతున్న కంత్రీలు రోజు రోజుకు మితిమీరిపోతున్నారు. ఆరోగ్యం బాగోలేక హాస్పిటల్‌కి వెళ్లినా, చదువుకుందామని కాలేజీకి వెళ్లినా, కూరగాయల కోసం మార్కెట్టుకు వెళ్లినా ఇలాంటివారి ఆగడాలకు అంతు లేకుండా పోతోంది. తాజాగా బీహార్‌లో ఓ డయాగ్నోస్టిక్ సెంటర్‌లో అల్ట్రాసౌండ్ స్కానింగ్ కోసం వెళ్లిన 19ఏళ్ల విద్యార్ధిని లైంగిక వేధింపులకు గురైంది. వివరాల్లోకి వెళితే బీహార్‌కు చెందిన భగల్పూర్‌లోని హాస్పిటల్ రోడ్డులో ఉన్న  బిరజీ డయాగ్నోస్టిక్ సెంటర్‌లో అల్ట్రాసౌండ్ స్కానింగ్ కోసం 19ఏళ్ల యువతి తండ్రితో పాటు వెళ్లింది. […]

డయాగ్నోస్టిక్ సెంటర్లో యువతికి  లైంగిక వేధింపులు
Follow us on

కామంతో కళ్లుమూసుకుపోతున్న కంత్రీలు రోజు రోజుకు మితిమీరిపోతున్నారు. ఆరోగ్యం బాగోలేక హాస్పిటల్‌కి వెళ్లినా, చదువుకుందామని కాలేజీకి వెళ్లినా, కూరగాయల కోసం మార్కెట్టుకు వెళ్లినా ఇలాంటివారి ఆగడాలకు అంతు లేకుండా పోతోంది. తాజాగా బీహార్‌లో ఓ డయాగ్నోస్టిక్ సెంటర్‌లో అల్ట్రాసౌండ్ స్కానింగ్ కోసం వెళ్లిన 19ఏళ్ల విద్యార్ధిని లైంగిక వేధింపులకు గురైంది.

వివరాల్లోకి వెళితే బీహార్‌కు చెందిన భగల్పూర్‌లోని హాస్పిటల్ రోడ్డులో ఉన్న  బిరజీ డయాగ్నోస్టిక్ సెంటర్‌లో అల్ట్రాసౌండ్ స్కానింగ్ కోసం 19ఏళ్ల యువతి తండ్రితో పాటు వెళ్లింది. స్కానింగ్ రూమ్‌లో వైద్యుడు ఆ యువతిని లైంగికంగా వేధించాడు. అయితే యువతి తండ్రిని బయటే ఉంచడంతో కొద్దిసేపటికి ఆమె కేకలు వేయడం ప్రారంభించింది. వెంటనే తండ్రి లోపలికి వెళ్లి చూసే సరికి ఆ వైద్యుడు ఆ యువతి చేతులు పట్టుకుని తనను మన్నించాలని ప్రాధేయపడుతున్న దృశ్యం కనిపించింది.  వెంటనే తండ్రిని చూసిన బాధితురాలు తనను వైద్యుడు లైంగికంగా వేధించాడని చెప్పడంతో కుటుంబ సభ్యులతో పాటు స్థానికులు కలిసి మూకుమ్మడిగా డయాగ్నోస్టిక్ సెంటర్‌పై  దాడి చేశారు.  అక్కడ ఉన్న వస్తువులన్నీ లాగిపారేసి, సీసీ  కెమెరాను సైతం ధ్వంసం చేశారు.

ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, వైద్యుడు అనిల్ కుమార్‌ను అదుపులోనికి తీసుకుని ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే  వైద్యుడు అనిల్ కుమార్ మాత్రం తనపై చేస్తున్న ఆరోపణలన్నీ  అబద్ధమని పేర్కొన్నాడు.