ల‌క్ష‌ల డోసుల వ్యాక్సిన్ ఉత్పత్తి మా ల‌క్ష్యం: సీర‌మ్ ఇన్‌స్టిట్యూట్

| Edited By:

Jul 18, 2020 | 7:53 PM

కోవిద్-19 విజృంభిస్తోంది. రోజురోజుకు పాజిటివ్ కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఈ వైరస్ కు వ్యాక్సిన్ కనుగొనే దిశగా చాలా దేశాలు ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలో వ‌చ్చే మూడు నెలల్లో కొన్ని ల‌క్ష‌ల డోసుల వ్యాక్సిన్‌ను

ల‌క్ష‌ల డోసుల వ్యాక్సిన్ ఉత్పత్తి మా ల‌క్ష్యం: సీర‌మ్ ఇన్‌స్టిట్యూట్
Follow us on

కోవిద్-19 విజృంభిస్తోంది. రోజురోజుకు పాజిటివ్ కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఈ వైరస్ కు వ్యాక్సిన్ కనుగొనే దిశగా చాలా దేశాలు ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలో వ‌చ్చే మూడు నెలల్లో కొన్ని ల‌క్ష‌ల డోసుల వ్యాక్సిన్‌ను ఉత్ప‌త్తి చేయాల‌ని తాము ల‌క్ష్యంగా నిర్ణ‌యించుకున్నామ‌ని సీర‌మ్ ఇన్‌స్టిట్యూట్ సీఈవో పూనావాలా చెప్పారు. ఇప్ప‌టికే ఇత‌ర వ్యాధుల‌కు సంబంధించి 1.50 బిలియన్ డోసుల వ్యాక్సిన్ త‌యారుచేసి ప్ర‌పంచ‌వ్యాప్తంగా విక్ర‌యించ‌డం ద్వారా సీర‌మ్ ఇన్‌స్టిట్యూట్ అతిపెద్ద వ్యాక్సిన్ త‌యారీ సంస్థ‌గా గుర్తింపు పొందింది.

దీనికి సంబంధించి సీర‌మ్ ఇన్‌స్టిట్యూట్ ఇప్ప‌టికే డీసీజీఐ అనుమ‌తి కూడా పొందింద‌ని పూనావాలా తెలిపారు. బ్రిట‌న్‌కు చెందిన ప్ర‌ముఖ ఫార్మా కంపెనీ ఆస్ట్రాజెనికాతో క‌లిసి ఇది క‌రోనా వ్యాక్సిన్‌ను ఉత్ప‌త్తి చేయ‌నుంద‌ని స్పష్టంచేశారు. అన్ని ట్ర‌య‌ల్స్ పూర్తిచేసుకుని లైసెన్స్ పొందిన త‌ర్వాత ఆ వ్యాక్సిన్‌ను ఉత్ప‌త్తి ప్రారంభ‌మ‌వుతుంద‌ని, అయితే ఆ వ్యాక్సిన్ ప్ర‌పంచ‌లో ప్ర‌తి ఒక్క‌రికీ అందుబాటులోకి రావ‌డానికి చాలా స‌మ‌యం ప‌ట్టే అవ‌కాశం ఉంద‌ని పూనావాలా అభిప్రాయ‌ప‌డ్డారు.