73 రోజుల్లో కోవిడ్ వ్యాక్సిన్.. క్లారిటీ ఇచ్చిన సీరమ్ సంస్థ..

Free Covid-19 vaccine shots in 73 days: దేశంలో మరో 73 రోజుల్లో కోవిడ్ వ్యాక్సిన్ ‘కోవిషీల్డ్’ అందుబాటులోకి వస్తుందంటూ జరుగుతున్న ప్రచారంపై సీరమ్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ ఇండియా(ఎస్ఐఐ) క్లారిటీ ఇచ్చింది. ఆ వార్తల్లో వాస్తవం లేదని.. అవన్నీ కూడా అసత్యం, ఊహాజనితం అని సీరమ్ సంస్థ తాజాగా ఓ ప్రకటనను విడుదల చేసింది. ప్రస్తుతం కోవిడ్ వ్యాక్సిన్‌ను తయారు చేసి భవిష్యత్తు తరాల కోసం దానిని నిల్వ ఉంచేందుకు మాత్రమే ప్రభుత్వం మాకు అనుమతిని […]

73 రోజుల్లో కోవిడ్ వ్యాక్సిన్.. క్లారిటీ ఇచ్చిన సీరమ్ సంస్థ..

Updated on: Aug 24, 2020 | 1:47 AM

Free Covid-19 vaccine shots in 73 days: దేశంలో మరో 73 రోజుల్లో కోవిడ్ వ్యాక్సిన్ ‘కోవిషీల్డ్’ అందుబాటులోకి వస్తుందంటూ జరుగుతున్న ప్రచారంపై సీరమ్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ ఇండియా(ఎస్ఐఐ) క్లారిటీ ఇచ్చింది. ఆ వార్తల్లో వాస్తవం లేదని.. అవన్నీ కూడా అసత్యం, ఊహాజనితం అని సీరమ్ సంస్థ తాజాగా ఓ ప్రకటనను విడుదల చేసింది.

ప్రస్తుతం కోవిడ్ వ్యాక్సిన్‌ను తయారు చేసి భవిష్యత్తు తరాల కోసం దానిని నిల్వ ఉంచేందుకు మాత్రమే ప్రభుత్వం మాకు అనుమతిని ఇచ్చిందని సీరమ్ సంస్థ పేర్కొంది. ఇప్పుడు ఇండియాలో జరుగుతున్న మూడోదశ క్లినికల్ ట్రయిల్స్ విజయవంతమై, అవసరమైన అనుమతులు లభించిన తర్వాతే కోవిషీల్డ్ వాణిజ్యపరంగా అందుబాటులోకి వస్తుందని ఎస్ఐఐ జాతీయ మీడియా ANIతో వెల్లడించింది. ఆస్ట్రాజెనెకాతో కలిసి ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ కోవిడ్ 19 వ్యాక్సిన్‌ను సీరమ్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ ఇండియా సిద్దం చేస్తోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆ వ్యాక్సిన్‌కు సంబంధించిన మూడో దశ క్లినికల్ ట్రయిల్స్ ఇండియాలోని వివిధ ప్రాంతాల్లో నిర్వహిస్తున్నారు.

Also Read:

ఏపీ విద్యార్థులకు అలెర్ట్.. డిగ్రీ, పీజీ కోర్సుల ఫీజులు ఖరారు.!

Breaking: తెలంగాణ ప్రవేశ పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది..

చైనా కరోనా వ్యాక్సిన్ ధర రూ. 10 వేలు..!

సెప్టెంబర్ 5 నుంచి పాఠశాలలు రీ-ఓపెన్.. దసరా, సంక్రాంతి సెలవులు కుదింపు..

‘సీఎం కావడానికి కేటీఆర్‌కు అన్ని అర్హతలు ఉన్నాయి’..

ప్రయాణీకులకు ఏపీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్…

టెర్రరిస్టుల జాబితాలో దావూద్.. లిస్టు రిలీజ్ చేసిన పాకిస్థాన్