ఒడిదుడుకుల్లో స్టాక్ మార్కెట్లు!

| Edited By:

Jun 13, 2019 | 6:30 PM

ఇండియన్ స్టాక్ మార్కెట్‌ గురువారం మిశ్రమంగా ముగిసింది. సెన్సెక్స్ 15 పాయింట్ల నష్టంతో 39,741 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 8 పాయింట్ల లాభంతో 11,914 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ప్రభుత్వ రంగ బ్యాంక్ షేర్లు పడిపోవడం మార్కెట్‌పై ప్రతికూల ప్రభావం చూపింది. ఆటో రంగ షేర్లలో అమ్మకాల ఒత్తిడి కొనసాగుతోంది. దీంతో సెన్సెక్స్ ఒకానొక సమయంలో 250 పాయింట్లకుపైగా నష్ట‌పోయింది. అయితే చివరకు రికవరీ అయ్యింది. నిఫ్టీ ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్, జీ ఎంటర్‌టైన్‌మెంట్, […]

ఒడిదుడుకుల్లో స్టాక్ మార్కెట్లు!
Follow us on

ఇండియన్ స్టాక్ మార్కెట్‌ గురువారం మిశ్రమంగా ముగిసింది. సెన్సెక్స్ 15 పాయింట్ల నష్టంతో 39,741 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 8 పాయింట్ల లాభంతో 11,914 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ప్రభుత్వ రంగ బ్యాంక్ షేర్లు పడిపోవడం మార్కెట్‌పై ప్రతికూల ప్రభావం చూపింది. ఆటో రంగ షేర్లలో అమ్మకాల ఒత్తిడి కొనసాగుతోంది. దీంతో సెన్సెక్స్ ఒకానొక సమయంలో 250 పాయింట్లకుపైగా నష్ట‌పోయింది. అయితే చివరకు రికవరీ అయ్యింది.

నిఫ్టీ ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్, జీ ఎంటర్‌టైన్‌మెంట్, బీపీసీఎల్, గ్రాసిమ్, కోటక్ మహీంద్రా బ్యాంక్ షేర్లు లాభాల్లో ముగిశాయి. ఇండియాబుల్స్ ఏకంగా 12 శాతం పెరిగింది. కాగా యస్ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, యూపీఎల్, ఐఓసీ, మారుతీ షేర్లు నష్టపోయాయి. యస్ బ్యాంక్ 13 శాతానికి పైగా పడిపోయింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 16 పైసలు తగ్గుదలతో 69.51 వద్ద ఉంది.