ఆ 35 మంది అమ్మాయిలూ చనిపోలేదు.. బీహార్ సెక్స్ రాకెట్‌లో షాకింగ్ ట్విస్ట్!

|

Jan 12, 2020 | 11:55 AM

రెండేళ్ల క్రితం బీహార్ షెల్టర్ హోమ్ సెక్స్ రాకెట్‌ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. తాజాగా ఈ కేసులో పెద్ద ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. చనిపోయారని భావిస్తున్న 35 అమ్మాయిలు బ్రతికే ఉన్నట్లు సీబీఐ సుప్రీంకోర్టుకు వెల్లడించింది. బీహార్‌లోని ముజఫర్‌పూర్‌లో ఈ హోంను నిర్వహిస్తున్న బ్రజేష్ ఠాకూర్ రాజకీయంగా పలుకుబడి ఉన్న వ్యక్తి. ఇక అతను, అతని అనుచరులు సుమారు 11 మంది యువతులను చంపేసి ఉండవచ్చునని పేర్కొన్న సీబీఐ.. ఆ షెల్టర్ పరిసరాల్లో గుట్టలుగా ఎముకలను స్వాధీనం […]

ఆ 35 మంది అమ్మాయిలూ చనిపోలేదు.. బీహార్ సెక్స్ రాకెట్‌లో షాకింగ్ ట్విస్ట్!
Follow us on

రెండేళ్ల క్రితం బీహార్ షెల్టర్ హోమ్ సెక్స్ రాకెట్‌ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. తాజాగా ఈ కేసులో పెద్ద ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. చనిపోయారని భావిస్తున్న 35 అమ్మాయిలు బ్రతికే ఉన్నట్లు సీబీఐ సుప్రీంకోర్టుకు వెల్లడించింది.

బీహార్‌లోని ముజఫర్‌పూర్‌లో ఈ హోంను నిర్వహిస్తున్న బ్రజేష్ ఠాకూర్ రాజకీయంగా పలుకుబడి ఉన్న వ్యక్తి. ఇక అతను, అతని అనుచరులు సుమారు 11 మంది యువతులను చంపేసి ఉండవచ్చునని పేర్కొన్న సీబీఐ.. ఆ షెల్టర్ పరిసరాల్లో గుట్టలుగా ఎముకలను స్వాధీనం చేసుకున్నట్లు గత ఏడాదే కోర్టుకు తెలిపిన సంగతి తెలిసిందే.

అయితే ఈ రోజు సీబీఐ.. ఇన్వెస్టిగేషన్‌లో భాగంగా తమకు రెండు అస్థిపంజరాలు లభించాయని.. అవి ఓ పురుషుడు, మహిళకు సంబంధించినవని ఫోరెన్సిక్ నివేదికలో తేలినట్లు స్పష్టం చేసింది. అంతేకాక మైనర్లు ఎవరూ అక్కడ చనిపోయినట్లు ఆధారాలు ఏవీ తమకు దొరకలేదని వెల్లడించింది.

సీబీఐ తరపున హాజరైన ఏజీ కెకె వేణుగోపాల్ మాట్లాడుతూ.. చనిపోయారని భావించిన అమ్మాయిలు తర్వాత సజీవంగానే ఉన్నట్లు గుర్తించామని… బీహార్‌లోని 17 షెల్టర్ హోమ్స్‌పై ఉన్న కేసులను సీబీఐ దర్యాప్తు చేసిందని తెలిపారు. ఇక వాటిల్లో 13 వసతి గృహాలపై ఛార్జ్‌షీట్ దాఖలు చేశామన్నారు. అంతేకాక నాలుగు కేసుల్లో ప్రాథమిక దర్యాప్తు జరిపి.. ఆధారాలు దొరక్కపోవడంతో మూసివేశారని ఆయన స్పష్టం చేశారు. ఇక సీబీఐ అందించిన నివేదికను చీఫ్ జస్టిస్ ఎస్.ఏ.బాబ్డే నేతృత్వంలోని బెంచ్ స్వీకరించడమే కాకుండా ఆ కేసుకు సంబంధించిన ఇద్దరు అధికారులను సైతం రిలీవ్ చేసింది.

కాగా, 2018 ఏప్రిల్‌లో ముజఫర్‌పూర్ షెల్టర్ హోమ్ సెక్స్ కుంభకోణం తొలిసారిగా వెలుగులోకి వచ్చింది. బ్రజేష్ ఠాకూర్ ఓ ఎన్జీఓను నిర్వహిస్తూ.. హోమ్‌లోని అనేకమంది బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. అంతేకాకుండా ఆ సంస్థ పరిసరాల్లో ఓ బాలిక అస్థిపంజరం లభించడంతో తీవ్ర కలకలం రేపింది. దీంతో ప్రధాన నిందితుడు బ్రజేష్ ఠాకూర్, అతని అనుచరులపై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఇక ఇదే రీతిలో బీహార్‌లోని మిగతా 16 షెల్టర్ హోమ్స్‌లో కూడా అమ్మాయిలపై దాడులు జరుగుతున్నాయని టీఐఎస్ఎస్ తన నివేదికలో పొందుపరచగా.. సుప్రీంకోర్టు సీబీఐ విచారణకు ఆదేశించిన సంగతి విదితమే.