కాంగ్రెస్ సీనియర్ నేత, గుజరాత్‌కు చెందిన రాజ్యసభ సభ్యుడు అహ్మద్ పటేల్ (71).. కరోనాతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆయన కుమారుడు ఫైజల్ ట్విటర్ ద్వారా వెల్లడించారు. బుధవారం తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో మరణించినట్లు తెలిపారు. నెల రోజుల క్రితం కరోనా బారిన పడి.. పలు అవయవాలు దెబ్బతిన్నట్లు వివరించారు.
కాంగ్రెస్ పార్టీలో ట్రబుల్ షూటర్‌గా పేరున్న అహ్మద్ పటేల్.. సుదీర్ఘకాలం సోనియాంగాధీకి రాజకీయ సలహాదారుగా పనిచేశారు. 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ విజయంలో ముఖ్య పాత్ర పోషించారు. గుజరాత్ నుంచి పలుమార్లు పెద్దల సభకు ఎన్నికయ్యారు. ఆయన మొదటిసారిగా 1977లో లోక్‌సభకు ఎన్నికయ్యారు. 1989 వరకు మూడుసార్లు ఎంపీ ఎన్నికల్లో గెలుపొందారు. 1993 నుంచి రాజసభ్య సభ్యునిగా కొనసాగుతున్నారు.
@ahmedpatel pic.twitter.com/7bboZbQ2A6
— Faisal Patel (@mfaisalpatel) November 24, 2020