వావ్ నరేష్ జీ.. వాట్ ఏ ‘జబర్దస్త్’ ఐడియా.!

|

Nov 28, 2019 | 4:52 PM

వారానికి రెండు రోజుల పాటు బుల్లితెర ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే ‘జబర్దస్త్’ షో నుంచి నవ్వులరేడు నాగబాబు ఎగ్జిట్ అయిన సంగతి తెలిసిందే. దాదాపు ఏడు సంవత్సరాల నుంచి ప్రసారమవుతున్న ఈ షో విపరీతమైన పాపులారిటీ సాధించడంలో నాగబాబు కీలక పాత్ర పోషించాడని చెప్పాలి. అయితే కొన్ని అనుకోని కారణాల వల్ల నాగబాబు ‘జబర్దస్త్’ షో నుంచి తప్పుకున్నాడు. దానితో ఇప్పుడు ఆ స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారనే దానిపై ఉత్కంఠ మొదలైంది. అటు మల్లెమాల ప్రొడక్షన్స్ […]

వావ్ నరేష్ జీ.. వాట్ ఏ జబర్దస్త్ ఐడియా.!
Follow us on

వారానికి రెండు రోజుల పాటు బుల్లితెర ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే ‘జబర్దస్త్’ షో నుంచి నవ్వులరేడు నాగబాబు ఎగ్జిట్ అయిన సంగతి తెలిసిందే. దాదాపు ఏడు సంవత్సరాల నుంచి ప్రసారమవుతున్న ఈ షో విపరీతమైన పాపులారిటీ సాధించడంలో నాగబాబు కీలక పాత్ర పోషించాడని చెప్పాలి. అయితే కొన్ని అనుకోని కారణాల వల్ల నాగబాబు ‘జబర్దస్త్’ షో నుంచి తప్పుకున్నాడు. దానితో ఇప్పుడు ఆ స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారనే దానిపై ఉత్కంఠ మొదలైంది. అటు మల్లెమాల ప్రొడక్షన్స్ కూడా ఎవరైతే పర్ఫెక్ట్‌గా సూట్ అవుతారనే దానిపై కసరత్తులు మొదలుపెట్టింది.

సాయి కుమార్, బండ్ల గణేష్.. ఇలా పలువురి పేర్లు పరిశీలనలో ఉన్నా.. నాగబాబు ప్లేస్‌ను ఎవరు భర్తీ చేయగలరనేదానిపై ఇంకా మల్లెమాలవారికి క్లారిటీ రాలేదు. ఈ నేపథ్యంలో మా అధ్యక్షుడు నరేష్.. ‘జబర్దస్త్’ జడ్జ్ సీట్‌పై కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చిన నరేష్.. తనకు ‘జబర్దస్త్’ అంటే ఇష్టమని.. ఎన్నో ఏళ్లగా షోను చూస్తున్నానని అన్నారు. అంతేకాక న్యాయనిర్ణేతగా వ్యవహరించేందుకు తనకు అవకాశం వస్తే.. తప్పకుండా వదులుకోనని పరోక్షంగా క్లారిటీ ఇచ్చారు. ఇప్పటికే ఒక వైపు ‘మా’ అధ్యక్షుడి బాధ్యతలు.. మరో వైపు సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న నరేష్.. ‘జబర్దస్త్’ మీద ఉన్న తన కోరికను ఇలా బహిర్గతం చేయడంతో.. మల్లెమాల బ్యానర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.