ఆంధ్రప్రదేశ్‌లో లోకల్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసిన తరువాత.. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ దేవాలయాల బాట పట్టారు. నిన్న మంగళగిరిలోని లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న ఆయన, ఆదివారం.. ఇవాళ కృష్ణాజిల్లాలోని మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వరస్వామిని దర్శించుకున్నారు. స్వామివారికి పాలాభిషేకం చేసి మొక్కుబడులు చెల్లించుకున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చిన అనంతరం ఈసీ నిమ్మగడ్డ దేవాలయాల సందర్శన ప్రాధాన్యత సందర్శించుకుంది. నిన్న మంగళగిరి పానకాల లక్ష్మీ నరసింహస్వామికి సాష్టాంగ నమస్కారాలు చేశారు నిమ్మగడ్డ.