Video viral: సూపర్‌ మార్కెట్లో చోరీ..సీసీ కెమెరాకు చిక్కిన కిలాడీ దొంగ.. !! దాదాపు రూ.29వేల తిండి లూటీ

|

May 18, 2022 | 1:16 PM

ఇటీవలి కాలంలో దొంగతనం కేసులు పెరిగిపోయాయి. పోలీసులు, స్థానికులు ఎంత నిఘాఏర్పాటు చేసినా, ఎవరు ఎంత అప్రమత్తంగా ఉన్నప్పటికీ దొంగలు రెచ్చిపోతున్నారు. దొరికితే చాలు చేతివాటం ప్రదర్శిస్తుంటారు. అయితే, కొన్ని సందర్బాల్లో దొంగలు

Video viral: సూపర్‌ మార్కెట్లో చోరీ..సీసీ కెమెరాకు చిక్కిన కిలాడీ దొంగ.. !! దాదాపు రూ.29వేల తిండి లూటీ
Seagull Robs
Follow us on

ఇటీవలి కాలంలో దొంగతనం కేసులు పెరిగిపోయాయి. పోలీసులు, స్థానికులు ఎంత నిఘాఏర్పాటు చేసినా, ఎవరు ఎంత అప్రమత్తంగా ఉన్నప్పటికీ దొంగలు రెచ్చిపోతున్నారు. దొరికితే చాలు చేతివాటం ప్రదర్శిస్తుంటారు. అయితే, కొన్ని సందర్బాల్లో దొంగలు కొన్ని ఫన్నీ పనులు చేస్తుంటారు. అలాంటి వార్తలు సోషల్‌ మీడియాలో కనిపిస్తుంటాయి. అయితే, ఇక్కడ కూడా ఓ ఫన్నీ విచిత్ర దొంగతనం జరిగింది. ఓ సూపర్‌ మార్కెట్లో చోరీకి వచ్చిన దొంగలు చిప్స్‌ ప్యాకెట్‌ ఎత్తుకుపోయాడు. తరచూ అలాగే చేస్తూ…ఏదో ఒక ఫుడ్‌ ఐటమ్‌ ఎత్తుకు పోయేవాడు..అలా ఏకంగా రూ. 29వేల వరకు ఆహారం దొంగతనం చేసినట్టుగా షాప్‌ యజమాని గుర్తించారు. అయితే, ఇక్కడ చోరీకి వచ్చిన దొంగ ఎవరో తెలిసి షాప్‌ నిర్వహకులు, సిబ్బంది షాక్‌ అయ్యారు. ఎందుకంటే, ఇక్కడ దొంగతనం చేసింది ఓ సీగల్‌ పక్షి..అదేలాగో ఇప్పుడు చూద్దాం..

విదేశాల్లో సీగల్ పక్షులు ఎక్కువగా కనిపిస్తాయి. ఇవి చూడటానికి పావురంలా కనిపిస్తాయి. కానీ నిజానికి అవి పావురాలు కావు. ఇవి పావురాల కంటే కాస్త పెద్ద సైజులో ఉంటాయి. ఒకప్పుడు ఇవి సముద్రాలు, సరస్సుల వద్ద చేపల్ని తింటూ బతికేవి. కానీ, ఇప్పటి పరిస్థితులు వేరు…సరస్సులు ఇంకిపోయాయి. చేపలు దొరకకపోవడంతో సీగల్‌ పక్షులు ఆహారం కోసం జనావాసాలలోకి రావడం ప్రారంభించాయి. ఎక్కడ ఆహారం కనిపించినా ఇవి దాడి చేసి మరీ తినేస్తున్నాయి. మనషులపై కూడా దాడి చేస్తూ ఎవరి చేతిలోనైనా ఆహారం కనబడితే ఎత్తుకుపోయే దుస్థితి నెలకొంది. అయితే తాజాగా,ఓ సీగల్‌ పక్షి సూపర్ మార్కెట్లలోకి చొరబడి ఆహారాన్ని దోచుకుంటు వీడియో వైరల్‌ అవుతోంది. వీడియో చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్స్‌ చేస్తున్నారు. అయితే, ఇప్పటి వరకు సీగల్‌ పక్షి చోరీ £300 (రూ.29,000) విలువైన ఆహారం ఎత్తుకుపోయిందని తెలిసింది. దేవన్‌లోని టెస్కో ఔట్‌లెట్‌ నుంచి ఆ పక్షి తరచూ చోరీలకు పాల్పడుతోందని స్థానికులు చెబుతున్నారు. బహుశా సీగల్‌ పక్షులు ఇప్పుడు ప్రకృతిలో దొరికే ఆహారం మానేసి సూపర్‌ మార్కెట్‌ ఫుడ్‌కు అలవాటుపడినట్టుంది అంటూ నెటిజన్లు ఫన్నీ కామెంట్స్‌ చేస్తున్నారు.