పాకిస్తాన్‌కు ఏమైంది..?

| Edited By:

Aug 09, 2019 | 12:36 PM

జమ్ము కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దు తర్వాత పాకిస్తాన్ తన నిజస్వరూపాన్ని ఒక్కొక్కటిగా బయటపెడుతూ వస్తోంది. రద్దు వ్యవహారం మన దేశానికి సంబంధించిన అంతర్గత వ్యవహారమని తెలిసినా.. నోటికొచ్చినట్టు మాట్లాడుతూ తన అక్కసును పూటకోసారి వెళ్లగక్కుతోంది. కాశ్మీర్ అంశంలో తలదూర్చి ప్రపంచ దేశాల్లో ఒంటరిగా మిగిలిపోతున్నప్పటికీ తన బుద్ధిని మాత్రం మార్చుకోలేకపోతుంది. ఆర్టికల్ 370 రద్దయిన వెంటనే పాక్ తన ఆక్రోషాన్ని వెళ్లగక్కడం ప్రారంభించింది. భారత్‌తో కొనసాగుతున్న ద్వైపాక్షిక సంబంధాలను వదులుకుంటున్నట్టు ప్రకటించింది. […]

పాకిస్తాన్‌కు ఏమైంది..?
Follow us on

జమ్ము కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దు తర్వాత పాకిస్తాన్ తన నిజస్వరూపాన్ని ఒక్కొక్కటిగా బయటపెడుతూ వస్తోంది. రద్దు వ్యవహారం మన దేశానికి సంబంధించిన అంతర్గత వ్యవహారమని తెలిసినా.. నోటికొచ్చినట్టు మాట్లాడుతూ తన అక్కసును పూటకోసారి వెళ్లగక్కుతోంది. కాశ్మీర్ అంశంలో తలదూర్చి ప్రపంచ దేశాల్లో ఒంటరిగా మిగిలిపోతున్నప్పటికీ తన బుద్ధిని మాత్రం మార్చుకోలేకపోతుంది.

ఆర్టికల్ 370 రద్దయిన వెంటనే పాక్ తన ఆక్రోషాన్ని వెళ్లగక్కడం ప్రారంభించింది. భారత్‌తో కొనసాగుతున్న ద్వైపాక్షిక సంబంధాలను వదులుకుంటున్నట్టు ప్రకటించింది. ఆ వెంటనే పాక్‌లో ఉన్న భారత రాయబారి బిసారియాను బహిష్కరించింది. అలాగే మన దేశంలో ఉన్న పాక్ రాయబారిని వెనక్కి రప్పించుకుంది. సరిహద్దు ప్రాంతంలో ఎప్పుడూ ఏదో ఒక రకంగా కవ్వింపు చర్యలకు పాల్పడే పాక్.. తాజాగా భారత్‌ ఫాసిస్ట్ విధానాలు అవలంబిస్తోందని ఆరోపించడం దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంది. పాక్ ఎంతవరకు వెళ్లిందంటే.. ఆగస్టు 14వ తేదీని ఆదేశ స్వతంత్ర దినోత్సవంగా జరుపుతుంది. అదే రోజును కశ్మీరీలకు సంఘీభావ దినంగా, మన ఆగస్టు 15న “బ్లాక్ డే”గా పాటించాలంటూ విషం చిమ్మింది. ఇదిలా ఉంటే ఆదేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మరో అడుగు ముందుకేసి.. పుల్వామాలో జరిగినట్టుగా దాడులు జరిగే అవకాశాలున్నాయని, ఇరు దేశాల మధ్య యుద్ధం కూడా రావచ్చని భయపెట్టారు.

ఇదిలా ఉంటే ఇరు దేశాల మధ్య కొనసాగుతున్న ద్వైపాక్షిక సంబంధాలను కూడా రద్దు చేస్తూ ప్రకటించింది పాక్. ఈ మేరకు జాతీయ భద్రతా కమిటీ సమావేశంలో పలు అంశాలపై తీవ్రంగా చర్చించారు ఆదేశ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్. తాజాగా ఢిల్లీ నుంచి లాహోరు‌కు వారానికి రెండు సార్లు ప్రయాణించే సంజౌతా ఎక్స్‌ప్రెస్ రైలును కూడా రద్దు చూస్తూ ప్రకటన విడుదల చేసింది . ఈ రైలు రద్దుతో ఇక్కడి నుంచి పాక్‌వెళ్లి చిక్కుకుపోయిన భారతీయులు ఇప్పుడు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భారత్‌కు ఎలా రావాలో అర్ధం కాక సతమతమవుతున్నారు. ఇదిలా ఉంటే అక్కడ భారతీయ సినిమాలు కూడా ప్రదర్శించవద్దని ఆఙ్ఞలు జారీ చేసింది పాక్ ప్రభుత్వం. మన బాలీవుడ్ సినిమాలు అక్కడ కూడా విడుదల కావడంతో మన హీరోలకు పెద్ద ఎత్తున ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది.

ఆర్టికల్ 370 రద్దు అంశం పూర్తిగా మనదేశ ఆంతరంగిక వ్యవహారం. దీనిలో మరో దేశానికి ఎట్టి పరిస్థితుల్లోనూ జోక్యం చేసుకునే అవకాశం లేదు. అయినా పాకిస్తాన్ ఎందుకిలా అయిపోతుంది.. అంటే మాత్రం ఒక్కటే సమాధానం. ఇంతకాలం స్వయం ప్రతిపత్తితో ఉన్న కాశ్మీర్‌పై కన్నేసిన పాకిస్తాన్‌కు భారత్ నిర్ణయం పాక్ గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్టయింది…. ఇప్పుడు జమ్ము కశ్మీర్ పూర్తిగా భారత రాజ్యంగ పరిధిలోకి రావడంతో ఆ ప్రాంతానికి కొండంత బలం వచ్చినట్టయ్యింది. అందుకే కల్లుతాగిన కోతిలా ప్రవర్తిస్తోంది పాక్.