స్కాట్లాండ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం… బాలికలు, మహిళలకూ ఉచితంగా నెలసరి వస్తువులు

|

Nov 26, 2020 | 3:39 PM

స్కాట్లాండ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తసుకుంది. ఆ దేశంలోని బాలికలు, మహిళలకూ ఉచితంగా నెలసరి వస్తువులు ఇవ్వాలని నిర్ణయించింది.

స్కాట్లాండ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం... బాలికలు, మహిళలకూ ఉచితంగా నెలసరి వస్తువులు
Follow us on

స్కాట్లాండ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తసుకుంది. ఆ దేశంలోని బాలికలు, మహిళలకూ ఉచితంగా నెలసరి వస్తువులు ఇవ్వాలని నిర్ణయించింది. ఇందుకు అనుగుణంగా అక్కడి ప్రభుత్వం ఇటీవల చట్టం తీసుకొచ్చింది. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ఇలాంటి సాహసోపేత నిర్ణయం తీసుకున్నది స్కాట్లాండ్‌. ఆ దేశంలోని మహిళలు, బాలికలకు నెలసరి వస్తువులు శానిటరీ ప్యాడ్స్, ట్యాంపన్స్ ను ఉచితంగా అందించేలా ప్రభుత్వం కొత్త చట్టాన్ని తెచ్చింది. స్కాట్లాండ్ పార్లమెంట్‌లో ఈ బిల్లును ప్రవేశపెట్టగా అందరి మద్దతుతో మంగళవారం బిల్లు ముక్తకంఠంతో ఆమోదం పొందింది. ఈ సందర్భంగా మంత్రి నికోలా స్టర్జియన్ మాట్లాడుతూ.. మహిళలకు, బాలికలకు ఇది ముఖ్యమైన పాలసీ అని అన్నారు. చట్టంలో భాగంగా ప్రభుత్వం ఇకపై మహిళలు, బాలికలకు నెలసరి వస్తువులను ఉచితంగా అందించనుంది. ఇక ఈ వస్తువులను ఉచితంగా అందించడం ద్వారా ప్రతి ఏడాది ప్రభుత్వానికి రూ. 236 కోట్ల ఖర్చు కానుంది. దీంతో కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్లు, మెడికల్‌ షాపులు, యూత్‌ క్లబ్‌లు.. జనసంచార ప్రదేశాల్లో వీటిని ఉచితంగా అందిస్తారు. 2018 నుంచే స్కాట్లాండ్‌లోని పాఠశాలల్లో టెంపోన్స్‌ను ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. శానిటరీ వస్తువులను ఉచితంగా అందించే నిర్ణయం ఓ మైలురాయిగా నిలిచిపోనున్నదని అక్కడి మహిళలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.