AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వర్షాల ధాటికి కుప్పకూలిన సుల్తాన్ బజార్ గవర్నమెంట్ స్కూల్

హైదరాబాద్ న‌గ‌రంలో చరిత్ర కలిగిన పాఠశాల భవనం కుప్పకూలింది. గ‌త కొన్నిరోజులుగా కురుస్తున్న వాన‌ల‌తో పాఠ‌శాల భ‌వ‌నం దెబ్బతిన్నది. సుల్తాన్ బ‌జార్‌లోని పాతకాలం నాటి ప్రభుత్వ పాఠ‌శాల భ‌వ‌నం బుధ‌వారం రాత్రి కూలిపోయింది.

వర్షాల ధాటికి కుప్పకూలిన సుల్తాన్ బజార్ గవర్నమెంట్ స్కూల్
Balaraju Goud
|

Updated on: Aug 27, 2020 | 3:57 PM

Share

హైదరాబాద్ న‌గ‌రంలో చరిత్ర కలిగిన పాఠశాల భవనం కుప్పకూలింది. గ‌త కొన్నిరోజులుగా కురుస్తున్న వాన‌ల‌తో పాఠ‌శాల భ‌వ‌నం దెబ్బతిన్నది. సుల్తాన్ బ‌జార్‌లోని పాతకాలం నాటి ప్రభుత్వ పాఠ‌శాల భ‌వ‌నం బుధ‌వారం రాత్రి కూలిపోయింది. దీంతో ఎన్డీఆర్ఎఫ్‌, మాన్‌సూన్ ఎమ‌ర్జెన్సీ బృందాలు ఘ‌ట‌నా స్థ‌లానికి చేరి శిధిలాల‌ను తొల‌గించాయి. క‌రోనా మ‌హ‌మ్మారి నేప‌థ్యంలో పాఠ‌శాల‌లు మూత‌ప‌డ‌టంతో పెను ప్రమాదం తప్పింది. అదీ రాత్రి స‌మ‌యం కావ‌డంతో ఎలాంటి ప్రాణ‌న‌ష్టం జ‌ర‌గ‌లేద‌ని, ఎవ‌రూ గాయ‌ప‌డ‌లేద‌ని జీహెచ్ఎంసీ అధికారులు వెల్ల‌డించారు. మరోవైపు, హైదరాబాద్ మహాన‌గ‌రంలోని ప‌లు ప్రాంతాల్లో ఈరోజు భారీ వాన‌లు కురిసే అవ‌కాశం ఉన్న‌ద‌ని వాతావరణ శాఖ తెలిపింది. సిటీలోని ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని సూచించారు. ఇక, ఇప్పటికే నగరంలో శిథిలావస్థకు చేరుకున్న భవనాలను గుర్తించిన అధికారులు నోటీసులు జారీ చేశారు. ముందు జాగ్రత్తగా తొలగించుకోవాలని కోరారు.

వరుసగా రెండోసారి కప్పుగెలిచే జట్టుగా భారత్ రికార్డు సృష్టిస్తాందా
వరుసగా రెండోసారి కప్పుగెలిచే జట్టుగా భారత్ రికార్డు సృష్టిస్తాందా
ఒకప్పుడు ఊపేసింది.. ఇప్పుడు ఇలా గుర్తుపట్టలేనంతగా మారిపోయింది..
ఒకప్పుడు ఊపేసింది.. ఇప్పుడు ఇలా గుర్తుపట్టలేనంతగా మారిపోయింది..
ఈ లయ 'శృతి' తప్పింది.. ఇంకాస్త అతి చేసి...
ఈ లయ 'శృతి' తప్పింది.. ఇంకాస్త అతి చేసి...
ఇండియా వర్సెస్ కివీస్.. జనవరి 11 నుంచి టీవీలకు అతుక్కుపోండి
ఇండియా వర్సెస్ కివీస్.. జనవరి 11 నుంచి టీవీలకు అతుక్కుపోండి
రాజకీయాల్లోకి దిగిన హీరోయిన్..
రాజకీయాల్లోకి దిగిన హీరోయిన్..
పోలీసులను చూసి స్పీడ్ పెంచిన అంబులెన్స్ డ్రైవర్.. ఆపి తనిఖీ చేయగా
పోలీసులను చూసి స్పీడ్ పెంచిన అంబులెన్స్ డ్రైవర్.. ఆపి తనిఖీ చేయగా
మీ ఫోన్‌లో వాట్సప్ అకౌంట్ బ్యాన్ అయిందా..? ఇలా చేస్తే చాలు..
మీ ఫోన్‌లో వాట్సప్ అకౌంట్ బ్యాన్ అయిందా..? ఇలా చేస్తే చాలు..
అరటిపండు ఏ టైమ్‌లో తినాలి.. ఎప్పుడు పడితే అప్పుడు తింటే..
అరటిపండు ఏ టైమ్‌లో తినాలి.. ఎప్పుడు పడితే అప్పుడు తింటే..
చూపుడు వేలు ఆకారం.. మీ వ్యక్తిత్వం తెలుపుతుందా.? పండితుల మాటేంటి?
చూపుడు వేలు ఆకారం.. మీ వ్యక్తిత్వం తెలుపుతుందా.? పండితుల మాటేంటి?
అగార్కర్ మార్క్ సెలక్షన్..అక్షర్ పటేల్‎కు ఊహించని ప్రమోషన్
అగార్కర్ మార్క్ సెలక్షన్..అక్షర్ పటేల్‎కు ఊహించని ప్రమోషన్