AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ration Cards: రేషన్ కార్డుదారులకు భారీ శుభవార్త.. కందిపప్పు నుంచి పామాయిల్ వరకు అన్నీ పంపిణీ.. ప్రభుత్వం కొత్త పథకం..

రేషన్ కార్డు ఉన్నవారికి తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలపనుంది. ప్రస్తుతం రేషన్ దుకాణాల ద్వారా సన్నబియ్యం పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం సన్నబియ్యం ధరలు కిలో రూ.100కి చేరుకున్న తరుణంలో.. రేషన్ షాపుల్లో వీటిని ఉచితంగా పొందవచ్చు. త్వరలో నిత్యావసర సరుకులు కూడా అందించనున్నారు.

Ration Cards: రేషన్ కార్డుదారులకు భారీ శుభవార్త.. కందిపప్పు నుంచి పామాయిల్ వరకు అన్నీ పంపిణీ.. ప్రభుత్వం కొత్త పథకం..
Ration Card
Venkatrao Lella
|

Updated on: Oct 27, 2026 | 1:06 PM

Share

ఎల్‌నివో పరిస్థితుల క్రమంలో తెలంగాణ ప్రభుత్వ అప్రమత్తమైంది. నివారణ చర్యలు చేపట్టేందుకు పక్కా ప్రణాళికలు రూపొందిస్తోంది. ఎల్‌నివో కారణంగా ఈ ఏడాది రాష్ట్రంలో భారీగా లోటు వర్షపాతం నమోదైంది. వచ్చే ఏడాదిలో కూడా ఇదే పరిస్థితులు ఉంటాయనే అంచనాలు వాతావరణశాఖ నుంచి వస్తుండటంతో మరింత క్లిష్టతర పరిస్ధితులు ఎదురుకానున్నాయి. వర్షాభావ పరిస్థితుల వల్ల పంటలు పండకపోవడంతో నిత్యావసర సరుకుల ధరలు పెరుగుతున్నాయి. దీంతో సామాన్యులపై పెను భారం పడుతోంది. ఈ క్రమంలో సామాన్యులను ఆదుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం ముందడుగు వేస్తోంది. రేషన్ కార్డులు ఉన్నవారికి ప్రస్తుతం సన్నబియ్యం అందిస్తుండగా.. త్వరలో నిత్యావస సరుకులు కూడా అతి తక్కువ ధరకు రేషన్ షాపుల ద్వారా పంపిణీ చేసేందుకు కసరత్తులు చేస్తోంది.

ఎల్‌నివోతో కరువు పరిస్థితులు, నిత్యావసర సరుకుల ధరలు పెరుగుతుండటంతో సామాన్యులకు భారం తగ్గించే చర్యలు ప్రభుత్వం చేపడుతోంది. అందులో భాగంగా రేషన్ దుకాణాల ద్వారా నిత్యావసర సరుకులను త్వరలో అందించేందుకు సమాయత్తం అవుతోంది. బియ్యంతో పాటు కందిపప్పు, గోధుమ పిండి, షుగర్, పామాయిల్, చింతపండు, కారంపొడి వంటి ఇంట్లోకి అవసరమయ్యే కిరాణా సురుకులను అతి తక్కువ ధరకే అందించనుంది. రేషన్ కార్డులు ఉన్నవారు వీటిని బియ్యంతో పాటు తీసుకోవచ్చు. దీని వల్ల సామాన్యులకు ఇంటి బడ్జెట్ తగ్గడం వల్ల డబ్బులు ఆదా అవుతాయి. ఇటీవల హైదరాబాద్‌లో పౌరసరఫరాల శాఖ అధికారులతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమావేశమయ్యారు. నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమంపై చర్చించారు. ఈ కార్యక్రమం ప్రారంభించేందుకు ముందుగా సరుకులను సేకరించడంపై చర్చించారు. 14 నెలలకు సరిపడ సరుకులను సేకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

సరుకులను సిద్దం చేసుకున్న తర్వాత ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించాలని యోచిస్తోంది. ఆహార కొరతను తీర్చడంతో పాటు పేద, మధ్యతరగతి ప్రజలకు ధరల భారాన్ని తగ్గించేందుకు ఈ కార్యక్రమం ఉపయోగపడనుంది. అటు ఇప్పటికే ఏపీలో బియ్యంతో పాటు గోధుమ పిండి, కందిపప్పు, పంచదార, పామాయిల్ వంటి సరుకులను రేషన్ షాపుల ద్వారా అందించే కార్యక్రమాన్ని ఇటీవల నాదెండ్ల మనోహర్ ప్రారంభించారు. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఇదే తరహా కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు సిద్దమవుతోంది. ఎల్‌నివో పరిస్థితుల నుంచి ప్రజలను కాపాడేందుకు ప్రభుత్వాలు చర్యలు చేపడుతున్నాయి. ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో కిలో బియ్యం రూ.100కి చేరుకుంది. 25 కేజీల బియ్యం బస్తా తీసుకోవాలంటే రూ.3 వేల వరకు పలుకుతుంది. దీంతో రేషన్ కార్డుదారులకు అందించే బియ్యం ఈ కష్టకాలంలో ఉపయోగపడుతుంది. ఇప్పుడు నిత్యావసర సరుకులు కూడా సబ్సిడీ ధరలకు అందించనుండటం శుభవార్తగా చెప్పవచ్చు.

Follow Us