లాక్ డౌన్ ఎఫెక్ట్: పౌరవిమానయాన శాఖకు సుప్రీం నోటీసులు!

| Edited By:

Apr 27, 2020 | 9:05 PM

కోవిద్-19 కరాళనృత్యం చేస్తోంది. ఈ మహమ్మారి కట్టడికోసం ప్రపంచ దేశాలన్నీ లాక్ డౌన్ విధించాయి. లాక్‌డౌన్‌ కారణంగా దేశవ్యాప్తంగా గత నెలరోజులుగా విమాన సర్వీసులు నిలిచిపోయాయి. అయితే ముందస్తుగా టికెట్లు

లాక్ డౌన్ ఎఫెక్ట్: పౌరవిమానయాన శాఖకు సుప్రీం నోటీసులు!
Follow us on

refund on air tickets: కోవిద్-19 కరాళనృత్యం చేస్తోంది. ఈ మహమ్మారి కట్టడికోసం ప్రపంచ దేశాలన్నీ లాక్ డౌన్ విధించాయి. లాక్‌డౌన్‌ కారణంగా దేశవ్యాప్తంగా గత నెలరోజులుగా విమాన సర్వీసులు నిలిచిపోయాయి. అయితే ముందస్తుగా టికెట్లు కొనుగోలు చేసిన ప్రయాణాలపై సదరు విమానయాన సంస్థలు తిరిగి చెల్లింపులపై ఇప్పటికీ స్పష్టత ఇవ్వలేదు. దీంతో ప్రవాసీ లీగల్‌ సెల్‌ అనే స్వచ్ఛంద సంస్థ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

కాగా.. లాక్‌డౌన్‌ కాలానికి (మార్చి25-మే3) కొనుగోలు చేసిన టికెట్ల పూర్తి మొత్తాన్ని ప్రయాణికులకు తిరిగి చెల్లించే విధంగా అన్ని విమానయాన సంస్థలకు ఆదేశాలు ఇవ్వాలని తన పిటిషన్‌లో కోరింది. విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు పౌరవిమానయాన సంస్థతోపాటు డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్ సివిల్‌ ఏవియేషన్‌(డీజీసీఏ)కు నోటీసులు జారీచేసింది.