AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SBI Mutual Fund : ఎస్‌బీఐ సరికొత్త స్కీమ్.. యుఎస్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టండి డబ్బులు సంపాదించుకోండి.. రూ.5000 లతో మొదలు..

SBI Mutual Fund: ఎస్‌బిఐ సరికొత్త పథకాన్ని ప్రారంభించింది. మొట్ట మొదటిసారిగా ఎస్‌బీఐ మ్యూచువల్ ఫండ్ అంతర్జాతీయ నిధిని ప్రారంభించింది.

SBI Mutual Fund : ఎస్‌బీఐ సరికొత్త స్కీమ్.. యుఎస్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టండి డబ్బులు సంపాదించుకోండి.. రూ.5000 లతో మొదలు..
Shiva Prajapati
|

Updated on: Feb 28, 2021 | 4:40 PM

Share

SBI Mutual Fund: ఎస్‌బిఐ సరికొత్త పథకాన్ని ప్రారంభించింది. మొట్ట మొదటిసారిగా ఎస్‌బీఐ మ్యూచువల్ ఫండ్ అంతర్జాతీయ నిధిని ప్రారంభించింది. ఈ స్కీమ్ ద్వారా సామాన్యులు సైతం అమెరికా స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టడానికి అవకాశం లభిస్తుంది. ఈ పథకం పేరు ఎస్‌బీఐ ఇంటర్నేషనల్ యాక్సెస్-యుఎస్ ఈక్విటీ ఎఫ్ఓఎఫ్. పెట్టుబడిదారుడు రూ. 5000 లతో తన పెట్టుబడిని ప్రారంభించవచ్చు. ఈ స్కీమ్‌లో పెట్టుబడులు పెట్టడం ద్వారా అంతర్జాతీయ నిధులు, విదేశీ ఫండ్స్ అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లలో పెట్టుబడులు పెడతాయి. ఈ నిధుల పెట్టుబడి ప్రధానంగా ఈక్విటీలో ఉంటుంది. పెట్టుబడిదారులు రుణాలు, వస్తువులు, రియల్ ఎస్టేట్, ఇతర రంగాలలో కూడా పెట్టుబడులు పెట్టవచ్చు.

అంతర్జాతీయ మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏమిటి..? స్టాక్ మార్కెట్ రెగ్యులేటర్ సెబీ నిబంధనల ప్రకారం, ఈక్విటీ (స్టాక్ మార్కెట్) లేదా ఇతర దేశాల ఈక్విటీ సంబంధిత సాధనాలలో 80 శాతానికి పైగా పెట్టుబడి పెట్టే మ్యూచువల్ ఫండ్స్ అంతర్జాతీయ నిధుల వర్గంలోకి వస్తాయి. గ్లోబల్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టడానికి అవకాశం ఇవ్వడమే కాకుండా, ఈ నిధులు ప్రజల మధ్య భౌగోళిక అసమానతలను తగ్గించడానికి కూడా సహాయపడుతాయి. ఇక గత 5 సంవత్సరాల క్రితం చూసుకున్నట్లయితే.. అంతర్జాతీయ మార్కెట్‌ మ్యూచువల్ ఫండ్స్ ద్వారా 32 శాతం వరకు రాబడి చేకూరుంది. ఇదిలాఉంటే.. ఎస్‌బీఐ తీసుకువచ్చిన అంతర్జాతీయ మ్యూచువల్ ఫండ్స్ స్కీమ్ ద్వారా భారతదేశానికి చెందిన పెట్టుబడిదారులు మార్కెట్ మానిఫోల్డ్‌ను సద్వినియోగం చేసుకోవచ్చునని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. తద్వారా నేరుగా గ్లోబల్ ఈక్విటీలలో పెట్టుబడి పెట్టవచ్చు.

అంతర్జాతీయ మ్యూచువల్ ఫండ్ల ద్వారా పెట్టుబడిదారులు భారతదేశం నుండి మార్కెట్ మానిఫోల్డ్‌ను సద్వినియోగం చేసుకోవచ్చని నిపుణులు అంటున్నారు. దీని ద్వారా, మీరు నేరుగా గ్లోబల్ ఈక్విటీలలో పెట్టుబడి పెట్టవచ్చు. వీటిలో పెట్టుబడి పెట్టడం వల్ల పెట్టుబడిదారుడి పోర్ట్ పోలియో వైవిధ్యభరితంగా ఉంటుంది. అంతేకాకుండా ఈ పెట్టుబడులు కాస్త సురిక్షతం అని నిపుణులు చెబుతున్నారు. దేశీయ కరెన్సీలో క్షీణతలు సహజం. తద్వారా పెట్టుబడులకు సంబంధించి కాస్త ఒడిదుడుకులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ కారణంగానే ప్రస్తుతం ఇంటర్నేషనల్ మ్యూచువల్ ఫండ్స్‌కు విపరీతంగా క్రేజ్ పెరుగుతోంది. ఇక ఈ ఫండ్లలో పెట్టుబడులు పెట్టడం.. దేశీయ ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టినట్లుగానే అనిపిస్తుంటుంది. లిబరైజ్జ్ రెమిటెన్స్ స్కీమ్ వారికి వర్తించకపోవడమే ఇందుకు కారణం.

రూ. 5000తో ప్రారంభించండి.. సెబీ నిబంధనల ప్రకారం, దాని వ్యయ నిష్పత్తి సంవత్సరానికి 2.25 శాతం. మీరు ఈ ఫండ్‌లో రూ. 5000 రూపాయల పెట్టుబడితో ప్రారంభించవచ్చు. కాగా, కరెన్సీ విలువ హెచ్చు తగ్గుల ప్రభావం పెట్టుబడిదారుల రాబడిపై ప్రభావం చూపుతుందని నిపుణులు అంటున్నారు. అదెలాగంటే.. అంతర్జాతీయంగా రూపాయి మారకం విలువ బలంగా ఉన్నట్లయితే.. పెట్టుబడిదారుల రాబడి తక్కువగా ఉంటుంది. అదే సమయంలో రూపాయి విలువ బలహీనపడినట్లయితే వారి రాబడి పెరుగుతుంది. ఇదిలాఉంటే.. ఈ పెట్టుబడుల విషయంలో చిన్న తిరకాసు కూడా ఉంది. మూడేళ్లు పెట్టుబడులు ఉంచినట్లయితే, దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను విధిస్తారు.

Also read:

Janasena in Telangana : తెలంగాణలో పార్టీ కార్యకలాపాలను విస్తరించే దిశగా అడుగులు వేస్తోన్న పవన్ కళ్యాణ్

Facebook BARS App: టిక్‌టాక్‌ మాదిరిగా ఫేస్‌బుక్‌ యాప్‌.. అద్భుతమైన ఫీచర్లతో అందుబాటులోకి..