State Bank Of India: ఎస్‏బీఐలో సూపర్ అవకాశం.. నెలకు కేవలం రూ.500 నుంచి కట్టొచ్చు..

| Edited By: Pardhasaradhi Peri

Jan 17, 2021 | 1:22 PM

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన కస్టమర్లకు కొత్త రకాల సేవలను అందుబాటులోకి తీసుకువస్తుంది. ఇందులో ఫ్లెక్సీ డిపాటిజ్ స్మీమ్ కూడా ఒకటి.

State Bank Of India: ఎస్‏బీఐలో సూపర్ అవకాశం.. నెలకు కేవలం రూ.500 నుంచి కట్టొచ్చు..
Follow us on

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన కస్టమర్లకు కొత్త రకాల సేవలను అందుబాటులోకి తీసుకువస్తుంది. ఇందులో ఫ్లెక్సీ డిపాటిజ్ స్మీమ్ కూడా ఒకటి. దీని ద్వారా ప్రతి నెల మీకు సాధ్యమైనంత అమౌంట్‏ను డిపాజిట్ చేయొచ్చు. ఇందులో ఒకేసారి డబ్బు జమచేయాలని రూల్ ఏం లేదు. ఫ్లెక్సీ డిపాజిట్ స్మీంలో ఏ సమయంలో అయిన డబ్బులు డిపాజిట్ చేసుకోవచ్చు. నెలకు రూ.500 డిపాజిట్ చేయొచ్చు. అంతేకాకుండా రూ.5000, గరిష్టంగా రూ.50 వేల వరకు డిపాజిట్ చేసుకోవచ్చు.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫ్లెక్సీ డిపాజిట్ స్మీమ్‏లో చేరితే కనీసం ఐదు సంవత్సరాల డబ్బులు డిపాజిట్ చేసుకుంటూ వెళ్ళాలి. అయితే దీనికి దాదాపు 7 సంవత్సరాల వరకు డిపాజిట్ చేసుకోవచ్చు. ఇదిలా ఉండగా.. టర్మ్ డిపాజిట్లకు వర్తించే వడ్డీ రేటు ఈ ఫ్లెక్సీ పథకానికి కూడా వర్తిస్తుంది. ఇందులో 5.4 శాతం వరకు వడ్డీ వస్తుంది. ఇక సీనియర్ సిటిజన్స్‏కు మాత్రం 0.5 శాతం ఎక్కువ వడ్డీ వస్తుంది. ఇక వినియోగదారులు తమ ఫెక్సీ అకౌంట్‏లో ఉన్న డబ్బుపై 90 శాతం మొత్తాన్ని రుణం కింద తీసుకోవచ్చు.

Also Read:

Signal App: వాట్సప్ ప్రైవసీ పాలసీ ఎఫెక్ట్.. నిలిచిపోయిన ‘సిగ్నల్’ యాప్.. అసలు కారణం ఇదే..

ఐసీఐసీఐ బ్యాంక్ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. ఇక నుంచి ఆ కార్డు హోల్డర్స్‏కు రూ.లక్ష వరకు లిమిట్..