SBI Clerk Mains results 2020 Declared: ఎస్‌బీఐ క్లర్క్ మెయిన్స్ 2020 ఫ‌లితాలు విడుద‌ల‌

|

Dec 26, 2020 | 12:29 PM

ఎస్బీఐ క్ల‌ర్క్స్ మెయిన్స్ 2020 ఫ‌లితాలు విడుద‌ల‌య్యాయి. ఎస్బీఐ త‌మ అధికారిక వెబ్ సైట్ లో ఈ ఫ‌లితాల‌ను విడుద‌ల చేసింది. అభ్య‌ర్థులు ఈ డైరెక్ట్ లింక్‌పై క్లిక్ చేసి ఫ‌లితాల‌ను....

SBI Clerk Mains results 2020 Declared: ఎస్‌బీఐ క్లర్క్ మెయిన్స్ 2020 ఫ‌లితాలు విడుద‌ల‌
Follow us on

ఎస్బీఐ క్ల‌ర్క్స్ మెయిన్స్ 2020 ఫ‌లితాలు విడుద‌ల‌య్యాయి. ఎస్బీఐ త‌మ అధికారిక వెబ్ సైట్ లో ఈ ఫ‌లితాల‌ను విడుద‌ల చేసింది. అభ్య‌ర్థులు ఈ డైరెక్ట్ లింక్‌పై క్లిక్ చేసి ఫ‌లితాల‌ను చూసుకోవ‌చ్చు. అయితే ఎస్బీఐ జూనియ‌ర్ అసోసియేట్స్ 2020 రిక్రూట్‌మెంట్‌లో భాగంగా అక్టోబ‌ర్ 31న న‌వంబ‌ర్ 7న దేశ వ్యాప్తంగా మెయిన్స్ ప‌రీక్ష‌లు జ‌రిగిన విష‌యం తెలిసిందే. అయితే మెయిన్స్ ప‌రీక్ష క‌ట్ ఆఫ్ తోపాటు ఎస్బీఐ క్ల‌ర్స్ 2020 ప‌రీక్ష‌, అంత‌కు ముందు సంవ‌త్స‌రం ప‌రీక్ష‌ల కోసం రాష్ట్రాల వారీగా, కేట‌గిరీల వారీగా క‌ట్ ఆఫ్‌ను విడుద‌ల చేశారు. క‌ట్ ఆఫ్ మార్కుల ఆధారంగానే అపాయింట్‌మెంట్ కోసం అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేస్తారు. దీని వ‌ల్ల‌ ఎస్బీఐలో దాదాపు 8 వేల ఉద్యోగాల‌ను భ‌ర్తీ కానున్నాయి.

ఎస్బీఐ మెయిన్స్ క్ల‌ర్క్స్ 2020 ఫ‌లితాలు చూసుకునే విధానం:

ముందుగా ఎస్బీఐ అధికారిక వెబ్ సైట్ sbi.co.in లోకి లాగాన్ అయి Careers ట్యాబ్‌పై క్లిక్ చేయాలి.
ఆ త‌ర్వాత అక్క‌డ క‌నిపిస్తున్న SBI Clerk Mains Exam Result notification పైన క్లిక్ చేయాలి. అందులో SBI results PDF page ప్ర‌త్య‌క్ష‌మ‌వుతుంది. ఆ PDF file ని డౌన్ లోడ్ చేసుకోవాలి. అవ‌స‌రం అనుకుంటే పీడీఎఫ్ పేజీలో అర్హులైన అభ్య‌ర్థుల‌కు సంబంధించి రోల్ నెంబ‌ర్లు ఉంటాయి. అందులో మీ అడ్మిట్ కార్డు నెంబ‌ర్ ఉందా లేదా అన‌ది చెక్ చేసుకోవ‌చ్చు.