శరవణ భవన్ అధినేతకు జీవితఖైదు

|

Mar 29, 2019 | 12:44 PM

చెన్నైకి చెందిన శరవణ భవన్ రెస్టారెంట్ అధినేత రాజగోపాల్ కు సుప్రీంకోర్టు జీవిత ఖైదు విధించింది. జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్ధించింది. రాజగోపాల్ తన సంస్థలో పనిచేసే ఉద్యోగి భార్యని పెళ్లి చేసుకోవడానికి సదరు ఉద్యోగిని హత్య చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీనికి మరో అయిదుగురు సహకరించినట్టు కూడా అభియోగం. దీనిపై మద్రాస్ హైకోర్టు విచారణ జరిపి రాజగోపాల్ కు జీవిత ఖైదు విధించింది. శిక్షను సవాల్ చేస్తూ […]

శరవణ భవన్ అధినేతకు జీవితఖైదు
Follow us on

చెన్నైకి చెందిన శరవణ భవన్ రెస్టారెంట్ అధినేత రాజగోపాల్ కు సుప్రీంకోర్టు జీవిత ఖైదు విధించింది. జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్ధించింది. రాజగోపాల్ తన సంస్థలో పనిచేసే ఉద్యోగి భార్యని పెళ్లి చేసుకోవడానికి సదరు ఉద్యోగిని హత్య చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీనికి మరో అయిదుగురు సహకరించినట్టు కూడా అభియోగం. దీనిపై మద్రాస్ హైకోర్టు విచారణ జరిపి రాజగోపాల్ కు జీవిత ఖైదు విధించింది. శిక్షను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్లిన ఆయనకు అక్కడ చుక్కెదురైంది. మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పు ఆమోదయోగ్యమైనదే అంటూ సుప్రీం తీర్పు ఇచ్చింది. శరవణ భవన్ అధినేత రాజగోపాల్‌కు ఈ హత్య కేసులో సుప్రీంకోర్టు 2009లో బెయిల్ మంజూరు చేసింది.