
Sale of Chinese products down: కోవిద్-19 కరాళనృత్యం చేస్తోంది. దేశవ్యాప్తంగా కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. గాల్వాన్ లోయలో భారత్ చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణల ప్రభావం చైనా ఉత్పత్తుల విక్రయాలపై పడింది. ఈ ఘటన అనంతరం దేశంలో చైనా ఉత్పత్తుల అమ్మకాలు గణనీయంగా తగ్గాయి. దేశంలోని పలు నగరాల్లో చైనా ఉత్పత్తులను నిషేధించాలని పలువురు డిమాండు చేశారు. ‘‘చాలామంది వినియోగదారులు చైనా ఉత్పత్తులు తమకు వద్దని చెపుతున్నారని, దీంతో తాము కూడా చైనా వస్తువులను విక్రయించేది లేదు’’ అని చంఢీఘడ్ నగరంలోని పటేల్ మార్కెట్ దుకాణదారుడు చెప్పారు.
గాల్వాన్ ఘటన అనంతరం.. చైనా ఉత్పత్తులను తాము కొనేదిలేదని పలువురు కొనుగోలుదారులు ఖరాఖండీగా చెపుతున్నారని మరో దుకాణదారుడు తెలిపారు. లడఖ్ ప్రాంతంలోని గాల్వాన్ లోయంలో 20 మంది భారత సైనికులను చైనా సైనికులు పొట్టనబెట్టుకున్న ఘటనతో ప్రజలు చైనాపై ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. చైనా వస్తువులను తాము కొనకుండా నిర్ణయం తీసుకున్నామని పలువురు వినియోగదారులు స్పష్టంచేశారు.
[svt-event date=”27/06/2020,10:08AM” class=”svt-cd-green” ]
Chandigarh: Shopkeepers say sale of Chinese goods has gone down after Galwan Valley clash which claimed lives of 20 soldiers. A shopkeeper in Patel market says,”Ppl are not buying Chinese products now.We’re also planning not to sell Chinese items once our existing stock is sold.” pic.twitter.com/AVG51pJjlN
— ANI (@ANI) June 26, 2020