సదర్ అదుర్స్, ప్రత్యేక ఆకర్షణగా దున్నపోతులు, భారీగా హాజరైన భాగ్యనగర వాసులు

|

Nov 16, 2020 | 9:31 AM

ఈసారి కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ సదర్‌ ఉత్సవం నిర్వహించారు నిర్వాహకులు. ఈ ఉత్సావాల్లో పాల్గొన్నవారు మాస్క్‌లు ధరించారు. మరోవైపు దున్నపోతులు ఈ ఉత్సవాల్లో హైలైట్‌గా నిలిచాయి.

సదర్ అదుర్స్, ప్రత్యేక ఆకర్షణగా దున్నపోతులు, భారీగా హాజరైన భాగ్యనగర వాసులు
Follow us on

ఈసారి కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ సదర్‌ ఉత్సవం నిర్వహించారు నిర్వాహకులు. ఈ ఉత్సావాల్లో పాల్గొన్నవారు మాస్క్‌లు ధరించారు. మరోవైపు దున్నపోతులు ఈ ఉత్సవాల్లో హైలైట్‌గా నిలిచాయి. దున్నపోతులను అందంగా అలంకరించి సదర్‌ ఉత్సవాలను తీసుకొచ్చారు వాటి యజమానులు. ఈసారి 30 దున్నపోతులు సదర్‌ ఉత్సవంలో పాల్గొన్నాయి.

సైదాబాద్‌లో నిర్వహించిన సదర్‌ ఉత్సవాల్లో యువకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. కొందరు యువకులు దున్నపోతులపైకి ఎక్కి కర్రసాము విన్యాసాలు ప్రదర్శించారు. అందంగా అలంకరించిన దున్నపోతులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.  యాదవులు జరుపుకునే అతిపెద్ద పండుగ సదర్. అయినా.. కుల, మతాలకు అతీతంగా భాగ్యనగరవాసులు పాల్గొంటారు. మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తోంది సదర్‌. హైదరాబాద్‌లో ఖైరతాబాద్‌లో జరిగిన సదర్ వేడుకల్లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. వచ్చే ఏడాది ఖైరతాబాద్‌ సదర్‌ ఉత్సవాలను రాష్ట్ర పండుగగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.

హైదరాబాద్‌లో సదర్‌ ఉత్సవం వందేళ్లుగా జరుగుతోందని నిర్వాహకులు చెబుతున్నారు. నారాయణగూడలో జరిగే సదర్‌ ఉత్సావానికి గతంలో 10 లక్షల మంది హాజరయ్యే వారంటున్నారు.  కరోనా కారణంగా ఈ ఏడాది డల్‌గా జరుగుతాయని అంతా భావించారు. నిర్వాహకులు కూడా మునుపటిలా ఏర్పాట్లు చేయలేదు. కానీ భాగ్యనగర వాసులు పెద్దసంఖ్యలో పాల్గొని సదర్‌ తొలిరోజు వేడుకల్ని అదుర్స్ అనిపించారు. ఈ కార్యక్రమాన్ని చూడడానికి ఆ ప్రాంత వాసులే కాకుండా వివిధ ప్రాంతాల నుంచి కూడా జనాలు తరలి వచ్చారు. సదర్ చూడడానికి ఎంతో సంబరపడుతూ వచ్చారు జనాలు. ప్రతి ఏటా ఇక్కడికి రావడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు.

Also Read : 

తెరుచుకున్న శబరిమల ఆలయం, నేటి నుంచే భక్తులకు అనుమతి, మార్గదర్శకాలివే

ఎన్టీఆర్​-త్రివిక్రమ్​ సినిమాకు ముహూర్తం ఫిక్స్ ! హీరోయిన్‌గా ఆమెను ప్రిఫర్ చేస్తున్నారట

పరమ పవిత్ర కార్తీక మాసం ప్రారంభం, నేడు బెజవాడ దుర్గమ్మకు గాజులతో విశేష అలంకరణ