విషాదంః పదవీ విరమణ రోజే.. పరలోక పయనం..

Sad Scene In Nellore District: విధికి కన్ను కుట్టింది. ఎప్పుడు, ఏం జరుగుతుందో మనిషి జీవితానికే తెలియని విచిత్రం విధికి తెలుసు. అదే సమయంలో అంతు చిక్కని జీవన్మరణ రహస్యాల్లో ఇదీ ఓ ఉదంతమే. లేకపోతే.. ఏంటి.? తన ఉద్యోగ పదవీ విరమణ రోజే.. ఆమె తన జీవితాన్ని కూడా శాశ్వతంగా వదిలేస్తారని ఆమెకు తెలుసా.? ఏమాత్రం ఊహించని వైనమిది! ఉదయమే విధులకు బయల్దేరి.. ఉద్యోగ విరమణ చేసే రోజున ఆమె కన్ను మూశారు. వివరాల్లోకి వెళ్తే.. […]

విషాదంః పదవీ విరమణ రోజే.. పరలోక పయనం..

Updated on: Feb 03, 2020 | 9:54 PM

Sad Scene In Nellore District: విధికి కన్ను కుట్టింది. ఎప్పుడు, ఏం జరుగుతుందో మనిషి జీవితానికే తెలియని విచిత్రం విధికి తెలుసు. అదే సమయంలో అంతు చిక్కని జీవన్మరణ రహస్యాల్లో ఇదీ ఓ ఉదంతమే. లేకపోతే.. ఏంటి.? తన ఉద్యోగ పదవీ విరమణ రోజే.. ఆమె తన జీవితాన్ని కూడా శాశ్వతంగా వదిలేస్తారని ఆమెకు తెలుసా.? ఏమాత్రం ఊహించని వైనమిది! ఉదయమే విధులకు బయల్దేరి.. ఉద్యోగ విరమణ చేసే రోజున ఆమె కన్ను మూశారు. వివరాల్లోకి వెళ్తే..

శ్రీహరికోట రాకెట్ కేంద్రంలో ఉద్యోగ విరమణ చేసే రోజే ఆకస్మికంగా ఓ ఉన్నతి ఉద్యోగి మృతి చెందారు. షార్‌లోని స్టోర్స్‌ విభాగంలో పర్చేజ్‌ అండ్‌ స్టోర్స్‌ అధికారిణిగా పి.రేవతి(60) అనే మహిళ పని చేస్తున్నారు. గత శుక్రవారం ఆమె ఉద్యోగ విరమణ చేసే రోజు. యధావిధిగా ఉదయాన్ని విధుల్లో చేరేందుకు సూళ్లూరుపేటలోని ఆమె ఇంటి దగ్గర నుంచి బయల్దేరారు. అయితే ఆమె అస్వస్థతకు గురి కావడంతో కుటుంబసభ్యులు హుటాహుటిన దగ్గరలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. కాగా, అప్పటికే ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో నెల్లూరులోని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌కు తీసుకెళ్తుండగా మార్గం మధ్యలోనే ఆమె తుది శ్వాస విడిచారు.