రాజస్థాన్…సచిన్ పైలట్ అనర్హతపై నేడే కోర్టు విచారణ

| Edited By: Pardhasaradhi Peri

Jul 20, 2020 | 10:37 AM

రాజస్తాన్ (మాజీ) డిప్యూటీ సీఎం సచిన్ పైలట్, ఆయనకు మద్దతునిస్తున్న మరో 18 మంది ఎమ్మెల్యేలు దాఖలు చేసిన పిటిషన్ పై రాజస్తాన్ హైకోర్టు సోమవారం విచారణ జరపనుంది. తమను సభ్యత్వానికి అనర్హులుగా ప్రకటిస్తూ స్పీకర్ జారీ చేసిన నోటీసును..

రాజస్థాన్...సచిన్ పైలట్ అనర్హతపై నేడే కోర్టు విచారణ
Follow us on

రాజస్తాన్ (మాజీ) డిప్యూటీ సీఎం సచిన్ పైలట్, ఆయనకు మద్దతునిస్తున్న మరో 18 మంది ఎమ్మెల్యేలు దాఖలు చేసిన పిటిషన్ పై రాజస్తాన్ హైకోర్టు సోమవారం విచారణ జరపనుంది. తమను సభ్యత్వానికి అనర్హులుగా ప్రకటిస్తూ స్పీకర్ జారీ చేసిన నోటీసును వీరు సవాలు చేశారు. రెబెల్ సభ్యులను అనర్హులుగా ప్రకటించవచ్చా అన్న అంశంపై కోర్టు వెలిబుచ్ఛే ఉత్తర్వులు.. ఈ వారంలో జరగవచ్చుననుకొంటున్న అసెంబ్లీ సమావేశాలపైన , సీఎం అశోక్ గెహ్లాట్ ఎదుర్కోనున్న ఫ్లోర్ టెస్ట్ పైన ప్రభావం చూపవచ్చు. సభలో బలపరీక్షను ఎదుర్కోవడానికి తను సిధ్ధమేనని గెహ్లాట్…. గవర్నర్ కల్ రాజ్ మిశ్రాకు ఇదివరకే స్పష్టం చేశారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందుకు, ప్రభుత్వాన్ని కూల్చడానికి మీరు చేస్తున్న ప్రయత్నాలకు మిమ్మల్ని ఎందుకు అనర్హులుగా ప్రకటించకూడదంటూ సచిన్ వర్గాన్ని స్పీకర్ ప్రశ్నించిన సంగతి తెలిసిందే. అయితే సభ సమావేశం కానప్పుడు మమ్మల్ని అనర్హులుగా ఎలా ప్రకటిస్తారని పైలట్ వర్గం ఎదురు ప్రశ్న వేస్తోంది. రాజ్యాంగ బధ్ధమైన ఇలాంటి సునిశిత అంశాలపై కోర్టు ఎలాంటి నిర్ణయం ప్రకటిస్తుందో చూడాలి.