మెప్పించలేకపోయిన సాహో పాటలు.. నిర్మాత వివరణ

| Edited By:

Aug 13, 2019 | 2:42 PM

ఎక్కడ చూసినా సాహో మానియా నడుస్తోంది. ఇండస్ట్రీతో సంబంధం లేకుండా, టాలీవుడ్, బాలీవుడ్ అని లేకుండా ఇండియాలోనే మోస్ట్ కాస్ట్లీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న సాహోపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటికే రిలీజైన ట్రైలర్‌తో అందరిమతులను పోగొట్టేశారు. యాక్షన్ కట్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే సాంగ్స్ విషయంలో కాస్త డిసపాయింట్‌గా ఉన్నారు ఫ్యాన్స్. ట్యూన్స్ బాగానే ఉన్నా ఏదో డబ్బింగ్ సినిమా పాటల్లానే ఉన్నాయని అంటున్నారు. అయితే సాహోను పాన్ ఇండియా మూవీగా […]

మెప్పించలేకపోయిన సాహో పాటలు.. నిర్మాత వివరణ
Follow us on

ఎక్కడ చూసినా సాహో మానియా నడుస్తోంది. ఇండస్ట్రీతో సంబంధం లేకుండా, టాలీవుడ్, బాలీవుడ్ అని లేకుండా ఇండియాలోనే మోస్ట్ కాస్ట్లీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న సాహోపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటికే రిలీజైన ట్రైలర్‌తో అందరిమతులను పోగొట్టేశారు. యాక్షన్ కట్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే సాంగ్స్ విషయంలో కాస్త డిసపాయింట్‌గా ఉన్నారు ఫ్యాన్స్. ట్యూన్స్ బాగానే ఉన్నా ఏదో డబ్బింగ్ సినిమా పాటల్లానే ఉన్నాయని అంటున్నారు. అయితే సాహోను పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేయాలనుకున్నప్పటికీ.. మొదట మాత్రం తెలుగు సినిమానే. ఆ తరువాత ప్రభాస్ క్రేజ్‌ను బట్టే మిగిలిన భాషల్లో విడుదల చేయాలనుకున్నారు. కాని ఇందులో తెలుగు సాహిత్యానికి, ఇక్కడి ప్రేక్షకులకు అంతగా ప్రాధాన్యం ఇవ్వకుండా నార్త్ ఆడియెన్స్‌కి తగిన విధంగా పాటలు కంపోజ్ చేశారు. ఇది వరకు బాహుబలిని కూడా తెలుగు, తమిళ్, హిందీ, మళయాళ్ భాషల్లో ఒకేసారి విడుదల చేసినప్పటికీ అందులోని పాటలు అన్ని భాషలకు తగిన విధంగా చేశారు. అయితే సాహో విషయంలో ఇది జరగలేదు.

ఇదిలా ఉంటే దీనిపై హిందీ వెర్షన్ నిర్మాత టి. సిరీస్ అధినేత భూషణ్ కుమార్ క్లారిటీ ఇచ్చారు. ముందు వీటిని నార్త్ ఆడియెన్స్‌ని దృష్టిలో పెట్టుకుని కంపోజ్ చేశామని, తర్వాత తెలుగులో రీ కంపోజ్ చేశామని అందుకే సాంగ్స్ అలా అనిపిస్తున్నాయని చెప్పారు. కాగా, అన్ని సాంగ్స్ విడుదల కాకముందే డిసైడ్ కాకూడదని అనుకుంటున్నారు. ఇప్పటికే ట్రైలర్‌తో అంచనాలు దాదాపు రీజ్ అయిన సుజీత్ సినిమాతో ఆ అంచనాలను చేరుకోగలిగేలా ఉన్నట్లు తెలుస్తోంది.