మా వ్యాక్సిన్ తో రెండేళ్ల పాటు రోగనిరోధక శక్తి,, రష్యా డెవలపర్ ప్రకటన, స్పుత్నిక్ టీకామందుకేదీ సాటిరాదట

తమ కోవిడ్ 19 వ్యాక్సిన్ స్పుత్నిక్ వీ రెండేళ్లపాటు రోగ నిరోధక శక్తినిస్తుందని రష్యాలోని దీని డెవలపర్ గమలేయా రీసెర్చ్ సెంటర్ ప్రకటించింది. ఫైజర్, బయో ఎన్ టెక్ సంస్థలు ఉత్పత్తి చేసిన  టీకామందు నాలుగైదు  నెలలకు..

మా వ్యాక్సిన్ తో రెండేళ్ల పాటు రోగనిరోధక శక్తి,, రష్యా డెవలపర్ ప్రకటన, స్పుత్నిక్ టీకామందుకేదీ సాటిరాదట

Edited By:

Updated on: Dec 15, 2020 | 9:42 PM

తమ కోవిడ్ 19 వ్యాక్సిన్ స్పుత్నిక్ వీ రెండేళ్లపాటు రోగ నిరోధక శక్తినిస్తుందని రష్యాలోని దీని డెవలపర్ గమలేయా రీసెర్చ్ సెంటర్ ప్రకటించింది. ఫైజర్, బయో ఎన్ టెక్ సంస్థలు ఉత్పత్తి చేసిన  టీకామందు నాలుగైదు  నెలలకు మించి ఇమ్యూనిటీని ఇవ్వజాలదని, కానీ తమ వ్యాక్సిన్ మాత్రం రెండేళ్ల పాటు ఇవ్వగలుగుతుందని భావిస్తున్నామని ఈ కంపెనీ హెడ్ అలెగ్జాండర్ జిన్ట్స్ బర్గ్ పేర్కొన్నారు. గతంలో తమ సంస్థ ఎబోలా వ్యాక్సిన్ తయారు చేసిందని, అదే టెక్నాలజీతో ఈ టీకామందును ఉత్పత్తి చేశామని ఆయన చెప్పారు. రెండేళ్ల కన్నా ఇంకా ఎక్కువకాలమే స్పుత్నిక్ వీ  రోగ నిరోధక శక్తిని ఇస్తుందని భావిస్తున్నామన్నారు. నిజానికి ప్రొటెక్షన్ అన్నది నాలుగైదు నెలలంటే అది చాలా స్వల్ప కాలం, దీన్ని మించి ఏ వ్యాక్సిన్ అయినా ఇమ్యూనిటీ ఇవ్వాల్సిందే అని అభిప్రాయపడ్డారు.

కోవిడ్ వ్యాక్సిన్ ని రిజిస్టర్ చేసిన దేశాల్లోప్రపంచంలో రష్యా మొదటి దేశమైంది. ఇది 95 శాతం సురక్షితమైనదని ప్రకటించింది. ఇప్పటికే 80 ఏళ్ళు పైబడిన వృధ్ధులకు తొలి దశలో ఈ వ్యాక్సిన్ ఇస్తున్నారు. అయితే ఇంకా 40 వేలమంది వాలంటీర్లపై తుది దశ ట్రయల్స్ జరగాల్సి ఉంది. రెండు డోసుల స్పుత్నిక్ వీ టీకామందును ఆమోదించిన దేశాల్లో బ్రిటన్, బహరైన్, కెనడా, సౌదీ అరేబియా, మెక్సికో తరువాత అమెరికా ఆరో దేశమైంది.