ర‌ష్యాలో ‘క‌రోనా’ కల్లోలం.. 24 గంట‌ల్లో 6060 కొత్త‌ కేసులు..

కోవిద్-19 ప్రపంచ దేశాలను వణికిస్తోంది. అగ్ర‌రాజ్యాల‌ను సైతం ఈ మ‌హ‌మ్మారి దెబ్బకు అతలాకుతలమయ్యాయి. అటు ర‌ష్యాలో కూడా 'కొవిడ్‌-19' ప్ర‌భావం తీవ్రంగానే ఉంది. గ‌డిచిన 24 గంట‌ల్లో రికార్డు స్థాయిలో 6,060 క‌రోనా

ర‌ష్యాలో క‌రోనా కల్లోలం.. 24 గంట‌ల్లో 6060 కొత్త‌ కేసులు..

Edited By:

Updated on: Apr 19, 2020 | 4:55 PM

కోవిద్-19 ప్రపంచ దేశాలను వణికిస్తోంది. అగ్ర‌రాజ్యాల‌ను సైతం ఈ మ‌హ‌మ్మారి దెబ్బకు అతలాకుతలమయ్యాయి. అటు ర‌ష్యాలో కూడా ‘కొవిడ్‌-19’ ప్ర‌భావం తీవ్రంగానే ఉంది. గ‌డిచిన 24 గంట‌ల్లో రికార్డు స్థాయిలో 6,060 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు కావ‌డం క‌ల‌వ‌ర పెట్టే విష‌యం. దీంతో ఇప్ప‌టివ‌ర‌కు ఆ దేశంలో ఈ మ‌హ‌మ్మారి బారిన ప‌డిన వారి సంఖ్య 42,853కి చేరింది.

కాగా.. ఈ నెల ప్రారంభం నుంచే క‌రోనా కేసులు శ‌ర‌వేగంగా పెరుగుతున్నాయ‌ని రష్యన్ కరోనావైరస్ క్రిసిస్ రెస్పాన్స్ సెంట‌ర్ పేర్కొంది. అంత‌కుముందు ‘కొవిడ్‌-19’ ఇంతలా సంక్ర‌మించ‌లేద‌ని తెలిపింది. ర‌ష్యాలో ఆదివారం నాటికి 361 మంది క‌రోనా వల్ల‌ మ‌ర‌ణించ‌గా… 3,291 మంది కోలుకుని ఆస్ప‌త్రి నుంచి డిశ్చార్జి అయ్యారు.

Also Read: అక్కడ తెరుచుకోనున్న రెస్టారెంట్లు.. పరుగులు తీయనున్న వాహనాలు..

Also Read: థియేటర్లు బంద్.. ఓటీటీల హవా..