మంత్రి చామకూర మల్లారెడ్డిపై సోషల్ మీడియాలో గుర్తు తెలియని వ్యక్తులు అసత్య కథనాలు ప్రసారం చేస్తున్నారంటూ ఓఎస్‌డీ సుధాకర్‌రెడ్డి హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గత కొద్దిరోజులుగా మంత్రికి వ్యతిరేకంగా తప్పుడు కథనాలు పోస్ట్ చేస్తున్నట్టు ఆయన పేషీకి వస్తున్న వారిలో కొందరు ఓఎస్‌డీ దృష్టికి తీసుకొచ్చారు. వాటిని పరిశీలించిన సుధాకర్‌రెడ్డి ఆ కథనాలు, వీడియోలు అభ్యంతరకంగా ఉన్నాయని గుర్తించి, పోలీస్ ఉన్నతాధికారులతో మాట్లాడారు. వారి సూచనల మేరకు సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీస్ అధికారులు ఐపీ చిరునామాలను సేకరించారు, మరిన్ని ఆధారాల కోసం పరిశోధిస్తున్నారు.