RTGS 24 Hours From Tonight: భారతీయ రిజర్వు బ్యాంక్(ఆర్బీఐ) వినియోగదారులకు గుడ్ న్యూస్ అందించింది. ఇకపై నగదు బదిలీకి సంబంధించిన ‘రియల్ టైమ్ గ్రాస్ సెటిల్‌మెంట్’ ఆర్టీజీఎస్ సేవల్ని 24 గంటలు అందుబాటులో ఉంటాయని తెలిపింది. ఇది డిసెంబరు 14 నుంచి 24*7 అమల్లోకి రానున్నట్లు ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ వెల్లడించారు.
ప్రస్తుతం ఈ సేవలు బ్యాంకుల పనిదినాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే లావాదేవీలు చేసుకునేందుకు అవకాశముంది. సుమారు రూ. 2 లక్షల కంటే పెద్ద మొత్తంలో నగదును బదిలీ చేసేందుకు ఈ సేవలను ఉపయోగించుకోవాలని ఆర్బీఐ కస్టమర్లను సూచించింది. ఆర్టీజీఎస్‌లో లావాదేవీలు అప్పటికప్పుడు క్షణాల్లో పూర్తవుతాయి.
Also Read:
‘జగనన్న అమ్మఒడి’ వివరాలను చెక్ చేసుకోండిలా.. సూచనలు ఇచ్చిన పాఠశాల విద్యాశాఖ..
మరో చోట ప్రత్యక్షమైన వింత స్థంభం.. షాకవుతున్న ప్రజలు.. మిస్టరీని చేధిస్తున్న పరిశోధకులు..