ఇక ట్విట్టర్‌లో ఆర్‌ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్!

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ కొత్తగా ట్విట్టర్‌ ఖాతా తెరిచారు. మోహన్ భగవత్ ఖాతా తెరవగానే నాలుగువేల మంది అనుచరులు ఆయన్ను ఫాలో అయ్యారు. ఇప్పటివరకు ఆర్ఎస్ఎస్ కు 1.3 మిలియన్ల మంది ఫాలోయర్స్ తో అధికారిక ఖాతా ఉంది. మోహన్ భగవత్ తోపాటు ఆర్ఎస్ఎస్ ప్రముఖ నేతలు మరికొందరు ట్విట్టర్ ఖాతాలు తెరిచారు. ట్విట్టర్ ఖాతాలు కొత్తగా ప్రారంభించిన వారిలో సురేష్ జోషి, సురేష్ సోని, కృష్ణ గోపాల్, వి భాగయ్య, […]

ఇక ట్విట్టర్‌లో ఆర్‌ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్!

Edited By:

Updated on: Jul 01, 2019 | 6:02 PM

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ కొత్తగా ట్విట్టర్‌ ఖాతా తెరిచారు. మోహన్ భగవత్ ఖాతా తెరవగానే నాలుగువేల మంది అనుచరులు ఆయన్ను ఫాలో అయ్యారు. ఇప్పటివరకు ఆర్ఎస్ఎస్ కు 1.3 మిలియన్ల మంది ఫాలోయర్స్ తో అధికారిక ఖాతా ఉంది. మోహన్ భగవత్ తోపాటు ఆర్ఎస్ఎస్ ప్రముఖ నేతలు మరికొందరు ట్విట్టర్ ఖాతాలు తెరిచారు. ట్విట్టర్ ఖాతాలు కొత్తగా ప్రారంభించిన వారిలో సురేష్ జోషి, సురేష్ సోని, కృష్ణ గోపాల్, వి భాగయ్య, అరుణ్ కుమార్, అనిరుద్ దేశ్ పాండేలున్నారు. కొత్తగా ట్విట్టర్ ఖాతాలు తెరిచిన మోహన్ భగవత్ ఇప్పటివరకూ ఒక్క ట్వీట్ కూడా చేయలేదు.