దివ్యాంగులకు 3.5 కోట్ల నిధులు.. అవసరమైతే ఇంకా మంజూరుచేస్తాం..

తెలంగాణ రాష్ట్రంలో అమలు పరుస్తున్న సంక్షేమ పథకాల్లో భాగంగా.. దాదాపు 10 లక్షల మంది దివ్యాంగులకు , ఇతర అత్యవసరాల కోసం ప్రస్తుతం రూ.3.5 కోట్ల నిధులు అందుబాటులో

దివ్యాంగులకు 3.5 కోట్ల నిధులు.. అవసరమైతే ఇంకా మంజూరుచేస్తాం..

Edited By:

Updated on: Jun 25, 2020 | 9:45 AM

Funds released to handicap people: తెలంగాణ రాష్ట్రంలో అమలు పరుస్తున్న సంక్షేమ పథకాల్లో భాగంగా.. దాదాపు 10 లక్షల మంది దివ్యాంగులకు , ఇతర అత్యవసరాల కోసం ప్రస్తుతం రూ.3.5 కోట్ల నిధులు అందుబాటులో ఉన్నాయని మహిళా, శిశు, దివ్యాంగులు, వృద్ధు ల సంక్షేమశాఖ కార్యదర్శి దివ్య హైకోర్టుకు విన్నవించారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో దివ్యాంగులకు ఆదుకోవాలని దాఖలైన పిటిషన్‌పై చీఫ్‌ జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్‌, జస్టిస్‌ విజయ్‌సేన్‌రెడ్డి నేతృత్వంలోని ధర్మాసనం బుధవారం మరోసారి విచారణ చేపట్టింది.

వీడియో కాన్ఫరెన్సింగ్‌ ద్వారా సంక్షేమశాఖ కార్యదర్శి దివ్య ఈ విచారణకు హాజరయ్యారు. దివ్యాంగుల కోసం రూ.10 కోట్లతో ప్రత్యేకనిధిని ఏర్పాటుచేసే అంశాన్ని పరిశీలించాలని హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఆమె వివరణ ఇచ్చారు. దివ్యాంగులకు ప్రభుత్వం నెలకు రూ.3,016 పింఛను అందజేస్తున్నదని, లాక్‌డౌన్‌లో రూ.1500 ఆర్థికసాయం, 12 కిలోల చొప్పున బియ్యం అందజేశామని పేర్కొన్నారు. ఔషధాలు అందజేయడానికి ప్రతి జిల్లాకు రూ.లక్ష నిధులు అందుబాటులో ఉంచామని తెలిపారు.