టాలీవుడ్ రేంజ్‌ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన ఎస్‌ఎస్ రాజమౌళి చెక్కుతోన్న తాజా చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. ఎవ్వరూ ఊహించని విధంగా టాలీవుడ్ టాప్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్‌లతో మల్టిస్టారర్ చిత్రంగా ఈ మూవీని తెరకెక్కిస్తున్నాడు జక్కన్న. అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్, కొమరం భీమ్ పాత్రలో ఎన్టీఆర్ నటిస్తున్నారు. ఫిక్షనల్ పాట్రియాటిక్ మూవీగా ఈ సినిమా తెరకెక్కుతోంది. అలియా భట్, ఒలీవియా మోరిస్ ఈ మూవీలో హీరోయిన్స్‌గా నటిస్తున్నారు.. మొత్తం పది భాషల్లో ఈ సినిమా రిలీజ్ ఉంటుందని మూవీ టీం అఫిషియల్‌గా అనౌన్స్ చేసింది. తాజాగా ఈ మూవీ నుంచి ఆసక్తికర వార్త ప్రచారంలోకి వచ్చింది.
రాజమౌళి స్థాయి ఇప్పుడు ‘బాహుబలి’మూవీతో వేరే రేంజ్‌కు వెళ్లింది. ఆయన సినిమా వస్తుందంటే ఎగబడి థియేటర్లకు వచ్చే జనాలు దేశ,విదేశాల్లో ఉన్నారు. ఆ అంచనాలకు తగ్గట్లుగా ‘ఆర్ఆర్ఆర్’ క్లైమాక్స్ ఫైట్‌ను దాదాపు రూ.150 కోట్లతో తెరకెక్కిస్తున్నారని సమాచారం. ఈ పోరాట దృృశ్యాలు చూసే ఆడియెన్స్ మరో ట్రాన్స్‌లోకి వెళ్లేలా జక్కన్న ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. కాగా సినిమా మొత్తం బడ్జెట్ రూ.350 కోట్లు అవుతోందని అంచనా వేస్తున్నారు. ఈ సంవత్సరం జులై 30న మూవీ ఆడియెన్స్ ముందుకు రానుంది.