రాజకీయంగా వేరైనా.. సినీ ఇండస్ట్రీకి వస్తే.. తనమన భేదం ఉండదు.. అందరూ యాక్టర్స్‌నే. ఇదే పాయింట్ రోజా, బాలయ్యలకు వర్తిస్తుందా..? ఇద్దరూ నవ్వుకుంటూ.. షూటింగ్‌లో పాల్గొంటారా..? ఇప్పుడు రోజా.. బాలకృష్ణ గురించి ప్రస్తావన ఎందుకొచ్చిందంటే.. బాలయ్య సినిమాలో.. రోజా ఓ ఇంట్రెస్టింగ్ రోల్ చేస్తుందనే వార్త.. ప్రస్తుతం జోరుగా వైరల్ అవుతోంది.
రోజా.. రాజకీయాల్లోకి వెళ్లాక.. నటనకు కాస్త దూరంగా ఉంది. రాజకీయాల్లో బిజిబిజీగా.. ఉంటోంది. దీంతో.. ఆమెకు సినిమాల్లో అవకాశాలొచ్చినా.. పాలిటిక్స్‌లో బిజీ కారణంగా.. అటు వైపు మొగ్గు చూపడం లేదు. కేవలం.. జబర్దస్త్ షో మాత్రం క్రమం తప్పకుండా చేస్తోంది. అప్పటికీ దానిపై కూడా ఫుల్‌గా కాంట్రవర్సీలు అల్లుకుంటున్నాయి. ఈ క్రమంలో.. బాలయ్య సినిమాలో.. రోజాకి ఓ స్పెషల్ ఆఫర్ వచ్చిందట.
105 సినిమా తరువాత బాలకృష్ణ బోయపాటితో ఓ సినిమా చేయబోతున్నారు. ఈ సినిమాలో ఓ స్పెషల్ రోల్ కోసం రోజాను.. బోయపాటి సంప్రదించినట్టు ఫిల్మ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. నెగిటీవ్‌గా కనిపించే పాజిటీవ్ పాత్రని.. అది రోజాకు ఫర్‌ఫెక్ట్‌గా సూట్ అవుతుందని బోయపాటి ఆలోచన అట. సినిమాలో ఇంటర్‌వెల్ వద్ద రివీల్ అయ్యే సీన్ అదని.. సెకంఢాఫ్ మొత్తం ఈ సీన్ కంటిన్యూ అవుతందని సమాచారం. అయితే.. ఆ పాత్ర రాజకీయాలకు సంబంధించి ఉండటంతో.. రోజా నో చెప్పిందట. ఒకవేళ వాటిని తొలగిస్తే.. ఆమె గ్రీన్ సిగ్నల్ ఇస్తారోమో అని టాక్ వినిపిస్తోంది.
ఏదేమైనా.. ఒక పక్క పాలిటిక్స్‌లో ఉన్న రోజా.. సడన్‌గా సినిమాలో రీ ఎంట్రీ ఇస్తే ఆ ఇంపాక్ట్ ఖచ్చితంగా.. రాజకీయాలపై పడుతుంది. అందులోనూ.. బాలకృష్ణతో సినిమా అనే సరికి.. రోజా వర్గీయులు ఒప్పుకుంటారో లేదో.. ఏదైమైనా.. ఒక సినిమా.. రెండు రాజకీయ పార్టీల మధ్య అగ్గి రాజేయడం ఖాయమనే అనిపిస్తుంది.