చిక్కిన రెండు భారీ కొండచిలువలు
కృష్ణాజిల్లా పామర్రు సమీపంలో భారీ కొండ చిలువ చిక్కింది. తోట్లవల్లూరు మండలం దేవరపల్లి దగ్గర కృష్ణానదిలో 15 అడుగులున్న ఈ కొండచిలువ జాలర్ల వలలో పడింది. దీంతో జాలర్లు అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. మరోవైపు, తెలంగాణలోని పొలంలో మరో కొండచిలువ రైతులకు చిక్కింది. వనపర్తి జిల్లా పాలెం గ్రామంలోని ఒక వ్యవసాయ రైతు పొలంలో వ్యవసాయ పనులు చేస్తున్న సమయంలో భారీ కొండచిలువ కనిపించింది. దీంతో గ్రామస్థులు కొత్తకోట మండల తహశీల్దార్ రమేష్ రెడ్డికి సమాచారం […]
కృష్ణాజిల్లా పామర్రు సమీపంలో భారీ కొండ చిలువ చిక్కింది. తోట్లవల్లూరు మండలం దేవరపల్లి దగ్గర కృష్ణానదిలో 15 అడుగులున్న ఈ కొండచిలువ జాలర్ల వలలో పడింది. దీంతో జాలర్లు అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. మరోవైపు, తెలంగాణలోని పొలంలో మరో కొండచిలువ రైతులకు చిక్కింది. వనపర్తి జిల్లా పాలెం గ్రామంలోని ఒక వ్యవసాయ రైతు పొలంలో వ్యవసాయ పనులు చేస్తున్న సమయంలో భారీ కొండచిలువ కనిపించింది. దీంతో గ్రామస్థులు కొత్తకోట మండల తహశీల్దార్ రమేష్ రెడ్డికి సమాచారం తెలిపారు. విషయం సాగర్ స్నేక్ సొసైటీ కృష్ణ సాగర్ టీమ్ సభ్యులు తెలుసుకుని గ్రామానికి చేరుకున్నారు.
పొలాల్లో దాగి ఉన్న భారీ కొండచిలువను చాకచక్యంగా పట్టుకున్నారు. ఇది అరుదైన రకం కొండచిలువ అని దీనిని రాక్ పైథాన్ అంటారని సభ్యులు తెలిపారు. దీని వయసు 12 సంవర్సరాములు ఉండవచ్చని.. దాదాపు 20 కేజీల బరువు కలిగిన ఆడ కొండచిలువ ఇదని దీనిని నల్లమల అటవీ ప్రాంతంలో వదిలేస్తామన్నారు టీమ్ సభ్యులు. ఇలాంటివి ఎక్కడైనా కనిపిస్తే చంప వద్దని వన్యప్రాణులను కాపాడాలని వాళ్లు కోరారు.