AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దేవుడి ఆశీర్వాదం వల్లే నాకు కరోనా సోకింది ః ట్రంప్‌ చిత్రమైన వ్యాఖ్య

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అప్పుడప్పుడు చిత్ర విచిత్రమైన మాటలు మాట్లాడుతుంటారు.. తనకు కరోనా సోకడం దేవుడిచ్చిన వరమని చెప్పుకొచ్చారు. ఇంతకు ముందు కరోనా అనేది ఇంచుమించు ఫ్లూ లాంటిదేనంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ట్రంప్...

దేవుడి ఆశీర్వాదం వల్లే నాకు కరోనా సోకింది ః ట్రంప్‌ చిత్రమైన వ్యాఖ్య
Balu
|

Updated on: Oct 08, 2020 | 11:30 AM

Share

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అప్పుడప్పుడు చిత్ర విచిత్రమైన మాటలు మాట్లాడుతుంటారు.. తనకు కరోనా సోకడం దేవుడిచ్చిన వరమని చెప్పుకొచ్చారు. ఇంతకు ముందు కరోనా అనేది ఇంచుమించు ఫ్లూ లాంటిదేనంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ట్రంప్‌ ఇప్పుడు కరోనా రావడమన్నది దేవుడి ఆశీర్వాదం అంటూ అభివర్ణించడం మరింత వివాదాన్ని రాజేసింది. కరోనా వైరస్‌ అంటుకున్నదని తెలిసిన వెంటనే ట్రంప్‌ మిలటరీ ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకున్నారు.. కోలుకున్న తర్వాత ఓ వీడియోను రిలీజ్‌ చేశారు.. ఆ వీడియోలో ఇదంతా చెప్పుకొచ్చారు. ‘కరోనా సోకడం వల్లనే కదా నాకు కరోనాను నయం చేయగల శక్తివంతమైన డ్రగ్స్‌ గురించి తెలిసింది’ అని స్టేట్‌మెంట్‌ ఇచ్చారు.. రెజెనెరాన్ ఫార్మాస్యూటికల్స్ డ్రగ్స్‌ వాడటం వల్లనే కదా అది కరోనాను ఎంత గొప్పగా నయం చేస్తుందో అనుభవంలోకి వచ్చింది అని చెప్పారు ట్రంప్‌. అలాగే తనకు వైద్య చికిత్స చేసిన డాక్టర్లను కూడా ట్రంప్‌ మెచ్చుకున్నారు. అమెరికా వాసులందరికీ ఇలాగే ఉచిత చికిత్స అందేలా చూసే బాధ్యత తనదని హామీ ఇచ్చారు. కరోనాను ప్రపంచంమీదకు వదిలిన చైనా భవిష్యత్తులో భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.