చైనాపై ట్రంప్ మరోసారి ఫైర్
ప్రపంచానికి కరోనా వైరస్ ను పరిచయం చేసిన చైనా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఫైర్ అయ్యారు
ప్రపంచానికి కరోనా వైరస్ ను పరిచయం చేసిన చైనా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఫైర్ అయ్యారు. వైరస్ సోకడం తప్పు కాదని.. ఈ తప్పంతా చైనాదన్నారు. దానికి చైనా భారీ మూల్యం చెల్లించుకోకతప్పదని ట్రంప్ ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన వీడియో ప్రసంగంలో పేర్కొన్నారు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ బుధవారం తనకు అందించిన కరోనా వైరస్ చికిత్సపై వైద్య సిబ్బందిని అభినందించారు. ఈ సందర్భంగా ఆయన కొవిడ్ బారినపడ్డ అమెరిక్లకు ఉచితంగా మందులు పంపిణీ చేస్తానని స్పష్టం చేశారు. ట్రంప్ తనకు కరోనా చికిత్స ఉపయోగించిన ఔషధాలపై ప్రశంసించారు. ఈ మందులు వైరస్ నివారణకు టీకాల వలే ముఖ్యమైనవన్నారు. ‘నేను హాస్పిటల్‌లో నాలుగు రోజులు గడిపానని, తక్కువ వ్యవధిలో కోలుకున్నానని ట్రంప్ తెలిపారు.
A MESSAGE FROM THE PRESIDENT! pic.twitter.com/uhLIcknAjT
— Donald J. Trump (@realDonaldTrump) October 7, 2020
హాస్పిటల్‌లో రెజెనెరాన్ అనే మందును ఇచ్చారని, దీన్ని తీసుకున్న వెంటనే మంచి అనుభూతిని పొందగాలిగానన్నారు. నేను ప్రస్తుతం ఎలా చేయగలుగుతున్నానో.. మూడు రోజుల క్రితం అలాగే అనిపించింది’ అని అన్నారు. ఈ సందర్భంగా వ్యాక్సిన్ల తయారీపై మాట్లాడిన ట్రంప్… జాన్సన్.. జాన్సన్, మోడరనా వంటి అనేక కంపెనీలు తయారు చేస్తున్న వ్యాక్సిన్లు చివరి దశలో ఉన్నాయని తెలిపారు. త్వరలోనే గొప్ప వ్యాక్సిన్ అందుబాటులోకి రాబోతున్నట్లు ఆయన చెప్పారు. కాగా, గతవారంలో ట్రంప్, మెలానియా దంపతులు కరోనా పరీక్షలు చేయించుకోగా పాజిటివ్‌గా నిర్థారణ. దీంతో ట్రంప్ వాల్టర్ రీడ్ నేషనల్ మిలటరీ హాస్పిటల్‌లో చికిత్స తీసుకున్నారు. సోమవారం ట్రంప్ హాస్పిటల్ నుంచి డిశ్చార్జై.. వైట్‌హౌజ్‌కు చేరుకున్నారు.