బీహార్ ఎన్నికల్లో ‘క్రిమినల్ అభ్యర్థులు’, టాప్ లో ఆర్జేడీ

| Edited By: Anil kumar poka

Oct 22, 2020 | 1:56 PM

బీహార్ ఎన్నికల్లో చాలామంది అభ్యర్థులకు నేర చరిత్ర ఉంది. మొత్తం లక్షా 64 వేల 328 మంది క్యాండిడేట్స్ లో ఎక్కువమంది క్రిమినల్ క్యాండిడేట్స్ విపక్ష ఆర్జేడీ లో ఉన్నట్టు ఎలక్షన్ వాచ్ డాగ్  అసోసియేషన్ ఆఫ్ డెమొక్రటిక్..

బీహార్ ఎన్నికల్లో క్రిమినల్ అభ్యర్థులు, టాప్ లో ఆర్జేడీ
Follow us on

బీహార్ ఎన్నికల్లో చాలామంది అభ్యర్థులకు నేర చరిత్ర ఉంది. మొత్తం లక్షా 64 వేల 328 మంది క్యాండిడేట్స్ లో ఎక్కువమంది క్రిమినల్ క్యాండిడేట్స్ విపక్ష ఆర్జేడీ లో ఉన్నట్టు ఎలక్షన్ వాచ్ డాగ్  అసోసియేషన్ ఆఫ్ డెమొక్రటిక్ రిఫామ్స్ తన నివేదికలో తెలిపింది. క్రిమినల్ చరిత్ర గల 73 మందిని ఆర్జేడీ నిలబెట్టగా 72 శాతం మంది బీజేపీ తరఫున పోటీ చేస్తున్నారు. 244 మంది తమపై సీరియస్ కేసులు ఉన్నట్టు అంగీకరించారు.లోక్ జన శక్తి పార్టీ తరఫున 41 మంది అభ్యర్థులకు నేర చరిత్ర ఉంది. కాంగ్రెస్ నుంచి 21 మంది, జేడీ-యూ నుంచి 35 మంది బీ ఎస్ పీ నుంచి 26 మందికి నేరచరిత్ర ఉందని వెల్లడైంది.