పొద్దుటూరులో భారీ గోల్డ్ గోల్‌మాల్

రాయలసీమలో అతిపెద్ద బంగారు బిజినెస్ సెంటర్‌గా పేరున్న కడప జిల్లా పొద్దుటూరులో ఓ బంగారు నగల షాపు యజమాని భారీ మోసానికి పాల్పడ్డారు. టౌనులోని...

  • Rajesh Sharma
  • Publish Date - 1:59 pm, Thu, 22 October 20
పొద్దుటూరులో భారీ గోల్డ్ గోల్‌మాల్

Cheating in the name of Gold ornaments:  రాయలసీమలో అతిపెద్ద బంగారు బిజినెస్ సెంటర్‌గా పేరున్న కడప జిల్లా పొద్దుటూరులో ఓ బంగారు నగల షాపు యజమాని భారీ మోసానికి పాల్పడ్డారు. టౌనులోని జె.వి.ఆర్ జ్యూవెలర్స్ యజమాని జింకా వెంకట రమణయ్య, ఆయన కుటుంబ సభ్యులు దాదాపు 200 మందిని 30 కోట్ల రూపాయల మేరకు మోసం చేశారు.లాక్ డౌన్‌కు ముందు ఆడపిల్లల పెళ్ళిళ్ళకి కావాల్సిన బంగారు తయారు కోసమని కొందరు, డబ్బులు వడ్డీలకు అని మరికొందరు.. ఇలా ఒక్కొక్కరు 2 లక్షలు నుంచి 7 లక్షల వరకు బంగారు షాప్ యజమానికి ఇచ్చారు. కానీ కొన్ని రోజులకే ఆ షాప్ యజమాని కరోనాతో మృతి చెందడంతో, తమ డబ్బులు వెనక్కి ఇవ్వాలని షాప్ యజమాని కుటుంబ సభ్యులును కోరగా తమకేం సంబంధం లేదని కుటుంబ సభ్యులు ప్లేట్ పిరాయించారు. బంగారం లేక డబ్బులు లేక ఆడపిల్లల పెళ్ళిళ్ళు కూడా ఆగిపోయాయని.. తమకు న్యాయం చేయాలని బాధితులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

కడపజిల్లా ప్రొద్దుటూరు అనగానే రెండో ముంబయిగా పేరు గాంచింది. ఇక్కడ అన్ని రకాల బిజినెస్ లు ఇక్కడ కొనసాగుతూ ఉంటాయి. ముఖ్యంగా రాయలసీమలో ఆడపిల్లల పెళ్లి జరుగుతుంది అంటే కచ్చితంగా పెళ్ళికి కావలసిన బట్టలు, బంగారు నగలు ప్రొద్దుటూరులోనే కొనుగోలు చేస్తూ ఉంటారు. అలాగే ప్రొద్దుటూరులో బంగారు షాపులు కూడా ఎక్కువే. ఈ నేపథ్యంలో ప్రొద్దుటూరులోని జె.వి.ఆర్ జ్యూవెలర్స్ యజమాని జింకా వెంకట రమణయ్యకి చాలా మంది తమ ఆడపిల్లల వివాహం నగల కోసం అని, ఇంట్లో వారి బంగారు నగల కోసం అని, మరికొందరు వడ్డీ డబ్బుల కోసమని దాదాపు 30 కోట్ల రూపాయల దాకా ఇచ్చారు. లాక్ డౌన్ రావడంతో దుకాణాలు అన్ని మూసివేశారు. అయితే కొన్ని రోజులకు బాధితులు అందరూ వెళ్లి యజమాని అడగ్గా డబ్బులు ఎక్కడికీ పోవని, కావాలంటే బాండు రాసి ఇస్తానని, లాక్ డౌన్ ముగిసిన తరువాత బంగారు నగలు చేయిస్తానని యజమాని హామీ ఇచ్చారు. సరేనని వారంతా బాండు పేపర్లు రాయించుకున్నారు .

ఈ నేపథ్యంలో 2020 జులై 30న సదరు యజమాని కరోనాతో మృతిచెందారు. ఆ విషయం బాధితులకు కొన్ని రోజుల తర్వాత తెలిసిన వెంటనే మృతుని బంధువు వద్దకు వెళ్లి అడిగితే రాసుకున్న బాండ్లు తీసుకొస్తే డబ్బులిస్తానని చెప్పారు. అనంతరం సమావేశం నిర్వహించి బాధితులకు 9 కోట్లు మాత్రమే వస్తుందని ఒక్కొక్కరికి 20 నుంచి 30 శాతం వరకు మాత్రమే ఇస్తామని చెప్పడంతో బాధితులు ఖంగుతిన్నారు. మేము కష్ట పడ్డ సొమ్ము అని మా డబ్బులు పూర్తి స్థాయిలో ఇవ్వాలని కోరడంతో యజమాని కుటుంబ సభ్యులు ససేమిరా అన్నారు. ఆ తర్వాత రమణయ్య కుటుంబం హైదరాబాద్ వెళ్లిపోయింది. బాదితులు స్థానిక పోలీసులను ఆశ్రయించారు. వారు పెద్దగా స్పందించకపోవడంతో జిల్లా ఎస్పీ అన్బురాజన్‌ను కలిసి మొరపెట్టుకున్నారు. అయితే ఆయన తిరిగి స్థానిక పోలీసులకే కేసును రెఫర్ చేశారు. దాంతో బాధితుల కష్టం మళ్ళీ మొదటికి వచ్చింది.

Also read: “నాగ్” మిసైల్ ప్రయోగం సక్సెస్

Also read: అరెస్టును అడ్డుకుని హంగామా చేసిన మహిళలు