
వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ ప్రతీ విషయాన్నీ వ్యంగ్యంగా చెప్పడం కొత్త కాదు. ఇవాళ నాగార్జున పుట్టిన రోజు శుభాకాంక్షల్ని సైతం వర్మ.. అదే తరహాలో చెప్పాడు. ‘మీరు ఏమి తింటున్నారో నాకు తెలియదు.. ఏ దేవుడుని కొలుస్తున్నారో.. ఇంకేం చేస్తారో తెలియదు. కానీ ప్రతి పుట్టిన రోజుకి మీరు ఇంకా ఇంకా కుర్రాడై పోతున్నారు. ఇలా అయితే కలకాలం ఇలాగే జీవించబోతున్నారు’ అంటూ ట్వీటాడు ఆర్జీవీ.
Hey @iamnagarjuna I don’t know what u eat, which god u pray to , what else u do ,but u look younger and younger with ur every birthday ..At this rate u are going to live forever ?????
— Ram Gopal Varma (@RGVzoomin) August 29, 2020