
సినిమా ప్రపంచంలో సంచలనాలు, వివాదాలకే కేరాఫ్ అడ్రస్ ఎవరంటే.. ముందుగా గుర్తుకు వచ్చే పేరు రామ్ గోపాల్ వర్మ. తాజాగా మరో వివాదానికి తెరలేపారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో జరిగిన పరువు హత్య ఆధారంగా ‘మర్డర్’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు ప్రకటించి.. మూవీ ఫస్ట్ లుక్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే.
అయితే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, ‘మర్డర్’ పోస్టర్‌పై ఆమె నిప్పులు చెరిగారు. పోస్టర్ చూసిన వెంటనే ఆత్మహత్య చేసుకోవాలనిపించిందని అమృత బాధపడ్డారు. తన కొడుకును చూసుకుంటూ ప్రశాంతంగా జీవితాన్ని బ్రతకడానికి ప్రయత్నిస్తుంటే.. ఇప్పుడు తన జీవితంలోకి రామ్ గోపాల్ వర్మ రూపంలో కొత్త సమస్య ఎదురవుతోందని వాపోయారు.
అమృత కామెంట్స్‌పై తన ట్విట్టర్ ద్వారా రామ్ గోపాల్ వర్మ స్పందించారు. “మర్డర్” చిత్రం మూడు నైతిక సందిగ్ధతల నేపథ్యంలో రూపొందిందని వివరించారు. ఇందులో మొదటిది “తండ్రి తన బిడ్డని నియంత్రణలో ఉంచడం”.. “రెండోది ఒక కూతురు.. తనకు ఏది మంచిదో తెలియకపోయినా అనుకున్నది చేయడం”… మూడోది “ఒకరి జీవితం కోసం మరొకరి జీవితాన్ని చేతుల్లోకి తీసుకోవడం సమర్ధించవచ్చా” అనే అంశాల ఆధారంగా “మర్డర్” చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లుగా చెప్పారు.
“మర్డర్” సినిమాని నిజజీవిత కథ ఆధారంగా రూపొందిస్తున్నామే తప్ప.., ‘నిజమైన కథ’ అని ఎక్కడ చెప్పలేదన్నారు. గతంలో రిల్‌లైఫ్ స్టోరీస్ ఆధారంగా నేను తీసిన చాలా సినిమాలు మంచి ఆదరణ పొందాయన్నారు.
My final message to writer of the note whether it’s Amrutha or anybody else is i have the highest respect for people who endured a tremendous trauma and my sincerety in MURDER will be to respect that pain and lessen it by putting their experience in a contextual retrospective pic.twitter.com/nvT3eELdbb
— Ram Gopal Varma (@RGVzoomin) June 22, 2020