మూడు సినిమాలుగా వస్తోన్న ఆర్జీవీ జీవితం

|

Aug 25, 2020 | 7:21 PM

బొమ్మాకు క్రియేషన్స్ సంస్థ నిర్మాణంలో వివాదాస్పద ఇండియన్ ఫిల్మ్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ జీవితం తెరకెక్కబోతోంది. మొత్తంగా ఆర్జీవీ నిజ జీవితాన్ని 3 భాగాలు, అంటే 3 సినిమాలుగా..

మూడు సినిమాలుగా వస్తోన్న ఆర్జీవీ జీవితం
Follow us on

బొమ్మాకు క్రియేషన్స్ సంస్థ నిర్మాణంలో వివాదాస్పద ఇండియన్ ఫిల్మ్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ జీవితం తెరకెక్కబోతోంది. మొత్తంగా ఆర్జీవీ నిజ జీవితాన్ని 3 భాగాలు, అంటే 3 సినిమాలుగా నిర్మించబోతోంది.
దీనికి సంబంధించిన పార్ట్ 1 ఫస్ట్ లుక్ పోస్టర్ రేపు 26 సాయంత్రం 5 గంటలకు రిలీజ్ చేయబోతున్నారు. 3 చిత్రాల్లో ఒక్కొక్క సినిమా నిడివి సుమారు 2 గంటలుంటుంది. అంటే 3 చిత్రాలు కలిపి మొత్తం 6 గంటలు. బొమ్మాకు మురళి నిర్మాణంలో రాంగోపాల్ వర్మ ఆధ్వర్యంలో ‘దొరసాయి తేజ’ ఈ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నారు. సెప్టెంబర్ లో ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కానున్నది.

పార్ట్ 1 లో 20 ఏళ్ళ ఆర్జీవీగా ఒక కొత్త యువ నటుడు నటించబోతున్నాడు. రాంగోపాల్ వర్మ జీవిత ప్రస్థానం ఆరంభం. దీంట్లో అతని విజయవాడ కాలేజ్ రోజులు, తొలి ప్రేమలు, అప్పట్లో ఆయన పాల్గొన్న గ్యాంగ్ ఫైట్స్ తో మొదలయ్యి , అయన శివ సినిమా చేయడానికి ప్రయత్నాలు ప్రధాన కథాంశంగా చూపెట్టబోతున్నారు.

పార్ట్ 2 లో వేరే నటుడు నటించబోతున్నాడు. ఇందులో అండర్ వరల్డ్ తో ప్రేమాయణం చూపిస్తారు. ముంబై జీవితంలో అమ్మాయిలు, గ్యాంగ్ స్టర్స్ మరియు అమితాబ్ బచ్చన్ లతో ఆయనకున్న అనుబంధాల గురించి ఉంటుంది.

పార్ట్ 3 లో ఆర్జీవీ యే స్వయంగా ఆర్జీవీగా నటించబోతున్నారు. RGV – ది ఇంటెలిజెంట్ ఇడియట్ గా వచ్చే ఈ మూవీలో ఆయన ఫెయిల్యూర్లు, వివాదాలు ఇంకా.. దేవుళ్ళు, సెక్స్, సమాజం పట్ల ఉన్న అతని విపరీత వైఖరులతో పాటు చాలా మంది మీద ఆర్జీవీ ప్రభావం గురించి చూపెట్టబోతున్నారు.