ఆర్టికల్ 370 రద్దుపై అమిత్ షా కీలక వ్యాఖ్యలు

| Edited By:

Aug 06, 2019 | 6:20 AM

ఆర్టికిల్ 370 రద్దుపై అపోహలు వద్దని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా తెలిపారు. జమ్మూకశ్మీర్ విభజన సందర్భంగా ఆయన పార్లమెంట్‌లో మాట్లాడారు. 370 రద్దుతో కశ్మీర్‌లో పరిస్థితులు చక్కబడతాయి. దీర్ఘకాల రక్తపాతానికి కారణమైన 370 కథ ముగిసింది. 370 వల్ల కశ్మీర్‌ ప్రజలకు ఎలాంటి లాభం జరగలేదు. 370, 35ఎ జమ్మూకశ్మీర్‌, లడఖ్‌కు తీవ్రనష్టం కలిగించాయి. 1950 నుంచి ఇప్పటి వరకు కశ్మీర్‌లో రక్తపాతం కొనసాగుతూనే ఉంది. శ్యామ్‌ప్రసాద్‌ ముఖర్జీ కలలు నెరవేరుతున్న సమయమిది. మేం ఓటు బ్యాంక్‌ […]

ఆర్టికల్ 370 రద్దుపై అమిత్ షా కీలక వ్యాఖ్యలు
Follow us on

ఆర్టికిల్ 370 రద్దుపై అపోహలు వద్దని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా తెలిపారు. జమ్మూకశ్మీర్ విభజన సందర్భంగా ఆయన పార్లమెంట్‌లో మాట్లాడారు. 370 రద్దుతో కశ్మీర్‌లో పరిస్థితులు చక్కబడతాయి. దీర్ఘకాల రక్తపాతానికి కారణమైన 370 కథ ముగిసింది. 370 వల్ల కశ్మీర్‌ ప్రజలకు ఎలాంటి లాభం జరగలేదు. 370, 35ఎ జమ్మూకశ్మీర్‌, లడఖ్‌కు తీవ్రనష్టం కలిగించాయి. 1950 నుంచి ఇప్పటి వరకు కశ్మీర్‌లో రక్తపాతం కొనసాగుతూనే ఉంది. శ్యామ్‌ప్రసాద్‌ ముఖర్జీ కలలు నెరవేరుతున్న సమయమిది. మేం ఓటు బ్యాంక్‌ రాజకీయాలు చేయడం లేదు. 370 రద్దు చేస్తే ఏదో జరుగుతుందని కొందరు ఆందోళన వ్యక్తం చేశారు. కశ్మీర్‌ ప్రజల కోసం గుజ్రాల్, మన్మోహన్‌ ప్రభుత్వాలు ఏం చేశాయి?. జమ్మూకశ్మీర్‌ సీఎంగా ఉండి ఆజాద్‌ ఏం చేశారు. 70 ఏళ్లుగా కశ్మీర్‌ ప్రజలకు అన్యాయం జరిగింది.370 రద్దుతో మహిళలకు, ఆదివాసీలకు న్యాయం జరుగుతుందని అమిత్ షా స్పష్టం చేశారు.