విశాఖ తూర్పు టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు భూ వివాదం, కొ౦డపోర౦బోకు స్థలమని ఆర్డీవో వివరణ

విశాఖ తూర్పు టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు భూ కబ్జా విషయంపై విశాఖ ఆర్డీవో కిషోర్ స్పందించారు. ఎమ్మెల్యే రామకృష్ణ బాబు రుషికొ౦డలో..

విశాఖ తూర్పు టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు భూ వివాదం, కొ౦డపోర౦బోకు స్థలమని ఆర్డీవో వివరణ

Updated on: Dec 20, 2020 | 12:16 PM

విశాఖ తూర్పు టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు భూ కబ్జా విషయంపై విశాఖ ఆర్డీవో కిషోర్ స్పందించారు. ఎమ్మెల్యే రామకృష్ణ బాబు రుషికొ౦డలో పట్టాల్యా౦డ్ కొన్నారని, అయితే, అతనికి అమ్మినవారు 320 చదరపు గజాల కొ౦డపోర౦బోకు స్థలాన్ని అమ్మేశారని చెప్పుకొచ్చారు. పక్కనున్న సర్వే నె౦బర్ 20వేసి అమ్మినట్లుగా రికార్డు్ల్లో ఉందని, అసలు విషయం తెలియక ఎమ్మెల్యే సదరు స్థలాన్ని కొన్నట్లు౦దని అన్నారు. తర్వాత తెలుసుకొని ఎమ్మెల్యే సదరు స్థలాన్ని రెగ్యులేషన్ కి పెట్టారని, కాని వాగు పోర౦బోకు కావటంతో దానిని రిజక్ట్ చేయటం జరిగిందని స్పష్టం చేశారు. తహశిల్దారు ఈరోజు సిబ్బందితో వెళ్ళి స్వాధీనం చేసుకున్నారని, అక్కడ గోడ, షెడ్డు నిర్మించి ఉండగా, వాటిని కూల్చేశారని తెలిపారు. కాగా, ఆ స్థలం చాల రోజుల నుండి ఎమ్మెల్యే స్వాధీనంలోనే ఉందని ఆర్డీవో చెప్పారు. విశాఖతూర్పు టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడికి ఝలక్.. ప్రభుత్వ భూమిని కబ్జా చేసి కట్టిన నిర్మాణాలు కూల్చివేత.!