లాల్‌దర్వాజ ఆలయ అభివ‌ృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు

చారిత్రక లాల్‌దర్వాజ సింహవాహిని అమ్మవారి బోనాల ఉత్సవ వేడుకల్లో రాజేంద్రనగర్‌ ఆర్డీవో చంద్రకళ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయాన్ని సుమారు వెయ్యి గజాల్లో విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లుగా ఆర్డీఓ చంద్రకళ తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ఈ ప్రణాళికలు సిద్ధం చేశామని అన్నారు. బోనాల ఉత్సవాల పూజలకు విచ్చేసిన చంద్రకళ… విస్తరణ కార్యక్రమాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. బండ్లగూడ ఎమ్మార్వో రూపొందించిన విస్తరణ ప్రణాళిక వివరాలపై తాను స్వయంగా ప్రభుత్వానికి విన్నవించి సాధ్యమైనంత […]

లాల్‌దర్వాజ ఆలయ అభివ‌ృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు

Edited By:

Updated on: Jul 11, 2020 | 7:06 PM

చారిత్రక లాల్‌దర్వాజ సింహవాహిని అమ్మవారి బోనాల ఉత్సవ వేడుకల్లో రాజేంద్రనగర్‌ ఆర్డీవో చంద్రకళ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయాన్ని సుమారు వెయ్యి గజాల్లో విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లుగా ఆర్డీఓ చంద్రకళ తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ఈ ప్రణాళికలు సిద్ధం చేశామని అన్నారు.

బోనాల ఉత్సవాల పూజలకు విచ్చేసిన చంద్రకళ… విస్తరణ కార్యక్రమాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. బండ్లగూడ ఎమ్మార్వో రూపొందించిన విస్తరణ ప్రణాళిక వివరాలపై తాను స్వయంగా ప్రభుత్వానికి విన్నవించి సాధ్యమైనంత త్వరగా ఆలయ విస్తరణ పనులు చేపట్టడానికి చొరవ తీసుకుంటానని చెప్పారు.