ఎన్‌హెచ్‌బీ, నాబార్డ్‌ల్లో వాటాలను విక్రయించిన ఆర్‌బీఐ

ముంబయి: నేషనల్‌ హౌసింగ్‌ బ్యాంక్‌, నేషనల్‌ బ్యాంక్‌ ఫర్‌ అగ్రికల్చర్‌ అండ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌ల నుంచి రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా దాదాపు తప్పుకుంది. వాటిల్లో ఉన్న మొత్తం వాటాలను రూ.1470 కోట్లకు ప్రభుత్వానికి విక్రయించింది. దీంతో అవి పూర్తి స్థాయి ప్రభుత్వ యాజమాన్య సంస్థలుగా మారాయి. మార్చి 19న ఎన్‌హెచ్‌బీలో ఫిబ్రవరి 26న నాబార్డ్‌లో తన వాటాలను విక్రయించినట్లు బుధవారం ఆర్‌బీఐ ప్రకటించింది. దీంతో ప్రభుత్వం ఇప్పుడు ఈ రెండు ఆర్థిక సంస్థల్లో 100 శాతం […]

ఎన్‌హెచ్‌బీ, నాబార్డ్‌ల్లో వాటాలను విక్రయించిన ఆర్‌బీఐ

Edited By:

Updated on: Apr 25, 2019 | 6:53 PM

ముంబయి: నేషనల్‌ హౌసింగ్‌ బ్యాంక్‌, నేషనల్‌ బ్యాంక్‌ ఫర్‌ అగ్రికల్చర్‌ అండ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌ల నుంచి రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా దాదాపు తప్పుకుంది. వాటిల్లో ఉన్న మొత్తం వాటాలను రూ.1470 కోట్లకు ప్రభుత్వానికి విక్రయించింది. దీంతో అవి పూర్తి స్థాయి ప్రభుత్వ యాజమాన్య సంస్థలుగా మారాయి. మార్చి 19న ఎన్‌హెచ్‌బీలో ఫిబ్రవరి 26న నాబార్డ్‌లో తన వాటాలను విక్రయించినట్లు బుధవారం ఆర్‌బీఐ ప్రకటించింది. దీంతో ప్రభుత్వం ఇప్పుడు ఈ రెండు ఆర్థిక సంస్థల్లో 100 శాతం వాటాలను చేజిక్కించుకుందని ఆర్‌బీఐ వెల్లడించింది. నరసింహం కమిటీ రెండో నివేదిక సిఫారసుల ఆధారంగా పెట్టుబడుల ఉపసంహరణ జరిగింది.