”చెల్లని” హీరో.. శివ కార్తికేయన్ ఓటెక్కడ..?

ఇటీవల దేశవ్యాప్తంగా రెండో దశ పోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తమిళనాడులో ఈనెల 18వ తేదీన జరిగిన పోలింగ్‌లో హీరో శివకార్తికేయన్‌ దంపతులు వలసరవాక్కంలోని ఓటు వేయడానికి పోలింగ్‌ కేంద్రానికి వెళ్లారు. శివ కార్తికేయన్ భార్య ఆర్తి పేరు ఓటరు జాబితాలో ఉండగా.. కార్తి కేయన్‌ పేరు మాత్రం గల్లంతైంది. దీంతో.. ప్రత్యేక అనుమతితో శివకార్తికేయన్ ఓటు వేశారు. అనంతరం, వేలికి సిరా ఉన్న ఫొటోను.. పోస్ట్ చేస్తూ.. ”ఓటు మన హక్కు.. దీని […]

''చెల్లని'' హీరో.. శివ కార్తికేయన్ ఓటెక్కడ..?
Follow us

| Edited By:

Updated on: Apr 25, 2019 | 12:01 PM

ఇటీవల దేశవ్యాప్తంగా రెండో దశ పోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తమిళనాడులో ఈనెల 18వ తేదీన జరిగిన పోలింగ్‌లో హీరో శివకార్తికేయన్‌ దంపతులు వలసరవాక్కంలోని ఓటు వేయడానికి పోలింగ్‌ కేంద్రానికి వెళ్లారు. శివ కార్తికేయన్ భార్య ఆర్తి పేరు ఓటరు జాబితాలో ఉండగా.. కార్తి కేయన్‌ పేరు మాత్రం గల్లంతైంది. దీంతో.. ప్రత్యేక అనుమతితో శివకార్తికేయన్ ఓటు వేశారు. అనంతరం, వేలికి సిరా ఉన్న ఫొటోను.. పోస్ట్ చేస్తూ.. ”ఓటు మన హక్కు.. దీని కోసం పోరాటం చేయాలి” అని తెలిపారు.

కాగా.. దీనిపై తమిళనాడు ఈసీ సత్యబ్రత సాహూ సీరియస్ అయ్యారు. శివ కార్తికేయన్ పేరు ఓటరు జాబితాలో పేరు లేకపోయినా ఎలా ఓటు వేశారని ప్రశ్నించారు. ప్రత్యేక అనుమతితో వలసరవాక్కంలోని గుడ్ షెపర్డ్ పాఠశాలలో ఆయన ఓటు వేశారని పోలింగ్ సిబ్బంది చెప్పారు. అయితే.. వీరిపై చర్యలు తీసుకుంటామని ఈసీ పేర్కొన్నారు. అటు.. కార్తికేయన్ ఓటు గల్లంతుపై విచారణకు ఆదేశించామని ఈసీ వెల్లడించారు.