గుడ్ న్యూస్: బ్యాంకుల్లో ఇక కనీస ఖాతా లేకున్నా ఓకే!

|

Jun 11, 2019 | 6:29 PM

ఖాతాదారులకు రిజర్వ్ బ్యాంక్ అఫ్ ఇండియా తీపి కబురు చెప్పింది. బ్యాంక్ అకౌంట్లలో ప్రతీ నెల ఖచ్చితంగా మినిమం బ్యాలెన్స్ ఉండాలన్న నిబంధనను ఎత్తివేసింది. ఇది ఇలా ఉంటే ఇప్పటివరకు గ్రామీణ, పట్టణ, నగర ప్రాంత ఖాతాదారులు తమ ఖాతాల్లో  ఖచ్చితంగా ప్రాంతాల వారీగా మినిమం బ్యాలెన్స్ ఉండేలా చూసుకోవాల్సి వచ్చింది. లేదంటే ఆయా బ్యాంకులు పెనాల్టీలు విధించేవి. ఇప్పుడు ఈ నిబంధనను ఆర్బీఐ ఎత్తివేయడంతో జీరో బ్యాలెన్స్‌తో ఖాతాదారులు తమ అకౌంట్ను కొనసాగించవచ్చు. ఇదే కాకుండా […]

గుడ్ న్యూస్: బ్యాంకుల్లో ఇక కనీస ఖాతా లేకున్నా ఓకే!
Follow us on

ఖాతాదారులకు రిజర్వ్ బ్యాంక్ అఫ్ ఇండియా తీపి కబురు చెప్పింది. బ్యాంక్ అకౌంట్లలో ప్రతీ నెల ఖచ్చితంగా మినిమం బ్యాలెన్స్ ఉండాలన్న నిబంధనను ఎత్తివేసింది. ఇది ఇలా ఉంటే ఇప్పటివరకు గ్రామీణ, పట్టణ, నగర ప్రాంత ఖాతాదారులు తమ ఖాతాల్లో  ఖచ్చితంగా ప్రాంతాల వారీగా మినిమం బ్యాలెన్స్ ఉండేలా చూసుకోవాల్సి వచ్చింది. లేదంటే ఆయా బ్యాంకులు పెనాల్టీలు విధించేవి. ఇప్పుడు ఈ నిబంధనను ఆర్బీఐ ఎత్తివేయడంతో జీరో బ్యాలెన్స్‌తో ఖాతాదారులు తమ అకౌంట్ను కొనసాగించవచ్చు.

ఇదే కాకుండా జరిమానా లేకుండా నెలకు నాలుగు సార్లు బ్యాంకులు, ఏటిఎంల నుంచి డబ్బులు విత్ డ్రా చేసుకునేలా ఆర్బీఐ కొత్త నిబంధన తీసుకువచ్చింది. ఈ మేరకు అన్ని బ్యాంకులకు కేంద్ర బ్యాంకు ఆదేశాలు జారీ చేసింది. కాగా ఈ ఆదేశాలు జూలై 1వ తేదీ నుంచి అమలులోకి రానున్నాయి. మరోవైపు బ్యాంకులలో ఎన్నిసార్లైనా డిపాజిట్ చేసుకునేలా వెసులుబాటు కల్గించింది. అలాగే ప్రత్యేక సౌకర్యాలు లేని బేసిక్‌ ఖాతా కలిగి ఉన్న ఖాతాదారులకు కూడా చెక్‌ బుక్‌ ఇవ్వాల్సిందేనని బ్యాంకులను ఆర్బీఐ ఆదేశించింది.