రాజధాని అమరావతి దాటి పోదు: రాయపాటిలో ఎందుకో ఇంత ధీమా!

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నగరాన్ని దాటి ఎక్కడికీ పోదంటున్నారు మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు. రాజధాని తరలింపు యత్నాలు త్వరలోనే ఆగిపోతాయని ధీమా వ్యక్తం చేశారు రాయపాటి సాంబశివరావు. అంతటి ధీమాకు కారణమేంటి అంటన్న చర్చ ఇప్పుడు ఏపీ రాజకీయ వర్గాల్లో మొదలైంది. గుంటూరు మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు తిరుమలలో మీడియాతో మాట్లాడారు. ఏపీ రాజధాని విషయంలో నెలకొన్ని గందరగోళానికి త్వరలోనే తెరపడుతుందని రాయపాటి అన్నారు. రాజధాని అమరావతి నగరాన్ని దాటి ఎక్కడికీ వెళ్ళదన్న ధీమా […]

రాజధాని అమరావతి దాటి పోదు: రాయపాటిలో ఎందుకో ఇంత ధీమా!
Follow us
Rajesh Sharma

|

Updated on: Feb 06, 2020 | 2:57 PM

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నగరాన్ని దాటి ఎక్కడికీ పోదంటున్నారు మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు. రాజధాని తరలింపు యత్నాలు త్వరలోనే ఆగిపోతాయని ధీమా వ్యక్తం చేశారు రాయపాటి సాంబశివరావు. అంతటి ధీమాకు కారణమేంటి అంటన్న చర్చ ఇప్పుడు ఏపీ రాజకీయ వర్గాల్లో మొదలైంది.

గుంటూరు మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు తిరుమలలో మీడియాతో మాట్లాడారు. ఏపీ రాజధాని విషయంలో నెలకొన్ని గందరగోళానికి త్వరలోనే తెరపడుతుందని రాయపాటి అన్నారు. రాజధాని అమరావతి నగరాన్ని దాటి ఎక్కడికీ వెళ్ళదన్న ధీమా వ్యక్తం చేశారు. రాజధాని తరలింపును టీడీపీ కచ్చితంగా అడ్డుకుంటుందని రాయపాటి అంటున్నారు. అమరావతి ఉద్యమం గత 50 రోజులుగా కొనసాగుతున్నా ముఖ్యమంత్రి జగన్ పట్టించుకోకపోవడం దారుణమని రాయపాటి వ్యాఖ్యానించారు.

రాజధాని తరలింపు జరగదని ధీమా వ్యక్తం చేసిన రాయపాటి.. తాను పార్టీ మారతానంటూ వస్తున్న వార్తలపై కూడా స్పందించారు. తాను ఏ పార్టీలోకి మారేది లేదని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం టీడీపీలోనే తనకు సంతోషంగా ఉందన్నారు. రాజధానిని తరలించవద్దంటూ ఢిల్లీ తరలివెళ్ళిన అమరావతి పరిరక్షణ జేఏసీ ప్రతినిధులు శుక్రవారం నాడు ప్రధాన మంత్రిని, శనివారం నాడు రాష్ట్రపతిని కల్వనున్నారని రాయపాటి వెల్లడించారు.