Raveena Tandon About KGF2: ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన కేజీఎఫ్ సినిమా సంచలన విజయం నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమాతో ప్రశాంత్ నీల్‌తో పాటు హీరో యష్ ఒక్కసారిగా జాతీయ స్థాయిలో పేరు సంపాదించుకున్నారు. ఇక ప్రస్తుతం కేజీఎఫ్ చిత్రానికి సీక్వెల్‌గా ‘కేజీఎఫ్2’ తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన అప్‌డేట్లు ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారుతున్నాయి.
తాజాగా ఈ సినిమాలో నటిస్తోన్న బాలీవుడ్ హీరోయిన్ రవీనా టాండన్ తన పాత్రపై కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సాధారణంగా ఏదైనా సినిమా సీక్వెల్‌లో నటించే ఆఫర్ వస్తే ముందుగా ఆ సినిమాను చూశాకే ఓకే చేస్తారు. కానీ రవీనా మాత్రం దానికి భిన్నంగా.. కేజీఎఫ్ సినిమాను చూడకుండానే సీక్వెల్ చిత్రానికి ఓకే చెప్పినట్లు తెలిపింది. కేవలం దర్శకుడు ప్రశాంత్ నీల్ చెప్పిన స్టోరీ లైన్ నచ్చడంతోనే సినిమాలో నటించేందుకు ఒప్పుకున్నట్లు చెప్పుకొచ్చింది. ఇక సినిమాకు సైన్ చేశాక చిత్రాన్ని చూసిన టాండన్.. ఆశ్చర్యానికి గురయ్యాయనని, సినిమా అద్భుతంగా ఉందంటూ వ్యాఖ్యలు చేసింది. ఈ సినిమాలో తన పాత్ర చాలా ఆసక్తికరంగా ఉంటుందని చెప్పుకొచ్చింది. ఇదిలా ఉంటే రవీనా గతంలో పలు తెలుగు చిత్రాల్లో నటించిన విషయం తెలిసిందే. ఇక యష్ పుట్టిన రోజు కానుకగా జనవరి 8న ఈ సినిమా టీజర్‌ను విడుదల చేయనున్నారు.
Also Read: kannada star yash : దయచేసి నాకోసం ఇంటికి రాకండి.. అభిమానులకు విజ్ఞప్తి చేసిన స్టార్ హీరో..