రేవ్ పార్టీలో డ్రగ్స్ కలకలం.. 60 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు.. సినీ, టీవీ పరిశ్రమకు చెందిన వారుకూడా..
రేవ్ పార్టీ పైన పోలీసులు దాడి చేసి 60మందిని అరెస్ట్ చేశారు. కేరళలో జరిగింది ఇది. కేరళలోని ఇడుక్కి జిల్లా వాగమోన్ కొండ ప్రాంతంలోని ఒక ప్రైవేట్ రిసార్ట్‌లో ఆదివారం రాత్రి భారీ రేవ్ పార్టీ జరిగింది.
రేవ్ పార్టీ పైన పోలీసులు దాడి చేసి 60మందిని అరెస్ట్ చేశారు. కేరళలోని ఇడుక్కి జిల్లా వాగమోన్ కొండ ప్రాంతంలోని ఒక ప్రైవేట్ రిసార్ట్‌లో ఆదివారం రాత్రి భారీ రేవ్ పార్టీ జరిగింది. పక్క సమాచారం అందుకున్న పోలీసులు అకస్మాత్ గా రైడ్ చేశారు. భారీగా డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. డ్రగ్స్ వినియోగిస్తున్న 60 మందిని అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన వారిలో సినీ, టీవీ పరిశ్రమకు చెందిన వారుకూడా ఉన్నారని తెలుస్తుంది. అలాగే రేవ్ పార్టీని నిర్వహించిన 9 మందిపై కేసులు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ఇక ఈ రిసార్ట్ ఓ పొలిటికల్ పార్టీ నేతకు చెందినదిగా పోలీసులు తెలిపారు. రైడ్ జరుగుతుండగా ఆ రాజకీయనేత అక్కడినుంచి జారుకున్నారని పోలీసులు తెలిపారు. ఇక డ్రగ్స్ వినియోగిస్తూ పట్టు బడిన వారిలో సినీ, టీవీ నటులు ఉండటంతో అక్కడి ఇండస్ట్రీ ఒక్కసారిగా ఉలిక్కి పడింది.